Bangarraju: అక్కినేని నాగార్జున- ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తోన్న సినిమా బంగార్రాజు. 019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’కు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షెడ్యూల్ త్వరలో రాజమండ్రిలో ప్రారంభం కానుంది సమాచారం. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతుకు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది.
అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. 2022 సంక్రాంతికి బరిలో దిగేందుకు మెకర్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తైన బంగార్రాజు సినిమా షూటింగ్. తదుపరి షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మొదలుకానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో మూడురోజుల షూటింగ్ కోసం నాగ చైతన్య అక్కడికి వెళ్లనున్నారట. కాగా, నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరోవైపు ఇటీవల లవ్‌స్టోరీతో సూపర్ హిట్ అందుకున్న చైతన్య.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు సమంతతో విడాకుల అనంతరం అనేక ప్రశ్నలు ఎదుర్కొంటున్నప్పటికీ.. అవేవీ పట్టించుకోకుండా జీవితంలో ముందుకు వెళ్లాలని సంకల్పించుకున్నారు చైతన్య. విక్రమ్ కె కుమార్‌తో మరో సినిమాను ఒప్పుకున్నారు చైతన్య.. దీనికి థాంక్యూ అనే టైటిల్ పెట్టారు. మరోవైపు, నాగార్జున ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అమలాపాల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాలో అమలాపాల్- నాగార్జునకు మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సీన్ల కోసం అమలాపాల్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.