Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప 2 సినిమాకు చాలా అరుదైన గౌరవమైతే దక్కుతుంది. ఈ సినిమా సాధించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇప్పటికీ భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు సాగుతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తుంది అంటూ ఈ సినిమా మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న పుష్ప 2 సినిమాలో కేవలం తనకు ఫోటో ఇవ్వలేదనే ఉద్దేశ్యంతో పుష్పరాజ్ ఆ స్టేట్ సీఎం నే మార్చాలని అనుకుంటాడు. ఇక ఇది సినిమా చూస్తున్నంత సేపు పర్లేదు అనిపించినప్పటికి సినిమా చూసిన తర్వాత ఒక స్పగ్నర్ స్టేట్ సీఎం మార్చుతాడు అంటే అది సమాజానికి వేరేలా కన్వే అవుతుంది అంటూ సినిమా విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని కామెంట్లైతే చేశారు. ఇక ఇదిలా ఉంటే కేవలం డబ్బులుంటే సీఎంని మార్చవచ్చు అనే పాయింట్ ని ఇక్కడ చాలా బలంగా చూపించారు. నిజంగా డబ్బుంటే సిఎం ను మార్చడం వర్కౌట్ అవుతుందా అంటే కాదనే చెప్పాలి.
ఎందుకు అంటే డబ్బులు ఉంటే సీఎంను మార్చే అవకాశం ఉంటే ఇప్పటికి చాలామంది బిజినెస్ మ్యాన్లు సీఎంలను మార్చి వాళ్లు సీఎం కుర్చీలో కూర్చునేవారు కదా! వాళ్లు అలా చేయడం లేదు. ఒకవేళ వాళ్లకు సీఎం అవ్వాలనే ఉద్దేశం లేకపోతే వాళ్లకు అనుకూలంగా ఉన్నవాళ్లను సీఎం గా మార్చుకునేవారు కదా అంటూ ఈ సినిమా మీద కొన్ని రకాల విమర్శలైతే చేస్తున్నారు. నిజానికి సీఎం ను మార్చడం అనేది పెద్ద వ్యవహారం అందులో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి.
హై కమాండ్ తో మాట్లాడి చాలా రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలందరిని తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇక దానితోపాటుగా ఆ ఎమ్మెల్యేలు కూడా ఎవరికి అయితే మద్దతు ఇస్తారో వాళ్లు మాత్రమే సీఎంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే చాలా తతంగం జరగాల్సి ఉంటుంది. డబ్బులు ఉన్నంత మాత్రాన ఇవన్నీ జరిగిపోవు అంటూ సినిమాలో ఈ సీను రియలేస్టిక్ గా లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సీన్ లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
కాబట్టి ఈ సీన్స్ ని సినిమాకోసం మాత్రమే రాశారు అని ఆడియన్స్ కూడా కన్వే అవుతున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే సినిమా చూస్తున్నంత సేపు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు. కానీ సినిమా చూసిన తర్వాత ఆలోచిస్తే మాత్రం కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉన్నాయి కదా అనే ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరి లో కలుగుతుంది.