Arya 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) నటించిన చిత్రాలలో మ్యూజిక్ పరంగా సెన్సేషన్ ని క్రియేట్ చేసిన చిత్రాలలో ఒకటి ‘ఆర్య 2′(Aarya 2 Movie). ఈ చిత్రంలోని ప్రతీ పాటకు అప్పట్లో వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు. ముఖ్యంగా ‘రింగ రింగ’ పాట అయితే ఆరోజుల్లోనే పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ ని సృష్టించింది. అదే విధంగా ఈ చిత్రం లోని పాటల్లో అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ కి వచ్చిన రెస్పాన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ అల్లు అర్జున్ పీక్ రేంజ్ డ్యాన్స్ అంటే, ఆర్య 2 చిత్రం గురించే చెప్తుంటారు ఆయన అభిమానులు. చాలా కాలం నుండి ఆయన అభిమానులు ఈ సినిమాని రీ రిలీజ్ చేయమని అల్లు అర్జున్ పీఆర్వో ని ట్యాగ్ చేసి అడుగుతూ ఉండేవారు. ఎట్టకేలకు అభిమానుల కోరికని మన్నిస్తూ, రెండు రోజుల క్రితమే ఈ సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.
Also Read : ‘ఆర్య 2’ థియేటర్స్ లో లవర్స్ రొమాన్స్..సోషల్ మీడియాని ఊపేస్తున్న వీడియో!
ఈ రీ రిలీజ్ కూడా అందరూ ఊహించినట్టుగానే గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అల్లు అర్జున్ పీఆర్వో టీం ఈ చిత్రానికి మొదటి రోజున నాలుగు కోట్ల రూపాయిలు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేసారు. కానీ ఆ నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వర్త్ కాదట, అందులో హైర్స్ కూడా ఉన్నాయట. రీ రిలీజ్ చరిత్రలో ఒక సినిమాకు హైర్స్ ని కలపడం ఈ చిత్రానికే జరిగింది. హైర్స్ ని ట్రేడ్ విశ్లేషకులు సాధారణంగా పరిగణలోకి తీసుకోరు, కాబట్టి ఈ చిత్రానికి హైర్స్ లెక్కలను తీసివేస్తే మొదటి రోజు కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది కచ్చితంగా మంచి వసూళ్లే, కానీ రికార్డు స్థాయి వసూళ్లు మాత్రం అసలు కాదనే చెప్పొచ్చు. రెండవ రోజు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, మొత్తం మీద రెండు రోజులకు కలిపి ఈ చిత్రం మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చిందని, అల్లు అర్జున్ కెరీర్ లో భారీ వసూళ్లను రాబట్టిన రీ రిలీజ్ చిత్రం అంటూ చెప్పుకొస్తున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ ముగిసే సమయానికి కచ్చితంగా ఈ చిత్రానికి నాలుగు కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు. ఈరోజు ఈ చిత్రానికి వసూళ్లు పెద్దగా ఉండకపోవచ్చు కానీ, రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో కచ్చితంగా డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పెద్దగా ప్రొమోషన్స్ లేకుండా, రీ రిలీజ్ కి వారం రోజుల ముందు అధికారిక ప్రకటన చేసి, ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు.
Also Read : ‘సలార్’ ని మించిన ‘ఆర్య 2’ రీ రిలీజ్..మొదటిరోజు ఎంత గ్రాస్ వచ్చిందంటే!