Arvind Trivedi: ‘రామాయణ్’ సీరియల్ లో రావణుడిగా నటించి మెప్పించిన ప్రముఖ నటుడు ‘అరవింద్ త్రివేది‘ ఇకలేరు. 1980వ దశకంలో బుల్లితెర పై ఎంతగానో అలరించిన ఆయన రావణుడి పాత్రకు ప్రాణం పోశారు. అరవింద్ త్రివేది ప్రస్తుత వయస్సు 82 సంవత్సరాలు. అయితే పెరిగిన వయసు రీత్యా ఆయన గత కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో తీవ్రంగా బాధ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనకు గత వారం హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు తేరుకుని హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత రాత్రి ఆయన కన్నుమూశారు. అరవింద్ త్రివేది మరణవార్తను ఆయన సహ నటుడు సుశీల్ లహిరి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు.
సుశీల్ లహిరి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ‘ఇది చాలా విచారకరమైన వార్త, మా ప్రియమైన అరవింద్ భాయ్ ఇక లేరనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం’ అంటూ సుశీల్ లహిరి పేర్కొన్నారు. ఇతర సినీ ప్రముఖులు కూడా అరవింద్ త్రివేది ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అరవింద్ తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో హిందీ, గుజరాతీ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు.
అలాగే ఆయన గొప్ప నటుడిగా దాదాపు 300 సినిమాల్లో నటించారు. అదే విధంగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా పనిచేయడం విశేషం. సినీ ప్రముఖులు అరవింద్ త్రివేది మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున అరవింద్ త్రివేది మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.