Arundhati Fame Child Artist: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సైతం సినిమా విజయంలో కీలకపాత్ర వహించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే… ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన చాలామంది ఇప్పుడు హీరోలుగా మారి మంచి విజయాలను అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క మెయిన్ లీడ్ లో వచ్చిన అరుంధతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రను పోషించిన దివ్య నగేష్ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా వరించింది. అయితే ఆమె అపరిచితుడు, సింగం పులి లాంటి పలు సినిమాల్లో నటించింది. ఇక అరుంధతి తర్వాత ఆమె పెద్దగా సినిమాల్లో అయితే కనిపించలేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆమె పెళ్లి చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన అజిత్ కుమార్ తో గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు మొత్తానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…ఇక అరుంధతి సినిమాలో ఆమె నటనను చూసిన చాలా మంది ఆమె మంచి నటిగా ఎదుగుతోంది. అవసరమైతే హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీ లో రాణిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె నటన మీద పెద్దగా ఆసక్తి చూపించనట్టుగా తెలుస్తోంది. హీరోయిన్ వేషాలను వేయడానికి కూడా ఆమె పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు…మరి మొత్తానికైతే ఆమె పెళ్లి చేసుకోవడంతో ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు…
Also Read: దేశాన్ని కుదిపేసింది.. మోడీ సైతం ప్రశంసించిన సినిమా ఏంటో తెలుసా..?
అయితే కోడి రామకృష్ణ అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర కోసం చేసినప్పుడు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులను చూశారట. వాళ్లకు స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయనకి పెద్దగా నచ్చకపోవడంతో అపరిచితుడు సినిమాలో నటించిన దివ్య ను చూసి తన టీమ్ తో ఆ అమ్మాయిని పిలిపించమని చెప్పాడట…
ఆమె వచ్చాక క్యారెక్టర్ చెప్పి తన చేత యాక్టింగ్ చేయించి మరి ఆమెను ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నట్టుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ తెలియజేశాడు… ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే దివ్య నటనకు మెచ్చిన కోడి రామకృష్ణ నువ్వు చాలా ఉన్నత స్థాయికి వెళ్తావని ఈ అమ్మాయిని దీవించినట్టుగా కూడా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా ఆమె ఇంకకొన్ని సినిమాలు చేశాక పెళ్లి చేసుకుంటే బాగుండేది.
Also Read: ‘వార్ 2’ కి వచ్చిన కలెక్షన్స్ లో మైనస్ షేర్స్..చరిత్రలో ఇదే తొలిసారి!
ఎందుకంటే ఇండస్ట్రీ లో మంచి నటులు అనేవారు చాలా అరుదుగా ఉంటారు. నటన అనేది ఆమెకి పుట్టుక తోనే వచ్చింది కాబట్టి హీరోయిన్ గా కాకపోయినా కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్ లలో నటించి తనకంటూ నటిగా ఒక మంచి ఐడెంటిటిని సంపాదించుకుంటే బాగుండేదని తన అభిమానులతో పాటు, పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…