arjuna phalguna telugu movie review: నటీనటులు : శ్రీ విష్ణు, అమృత అయ్యర్, సీనియర్ నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు.
దర్శకుడు: తేజ మర్ని
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సంగీతం : ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
ఎడిటర్: విప్లవ్ నైషాదం
వైవిధ్యభరిత కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా తేజ మర్ని దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
అర్జున్ (శ్రీవిష్ణు)కి తన గ్రామం అన్నా, తన స్నేహితులు అన్నా ప్రాణం. ఎలాగూ చదువు ఎక్కలేదు కాబటి.. ఊర్లో పాలు అమ్ముకుంటూ, సరదాగా స్నేహితులతో తిరుగుతూ కాలాన్ని నెట్టుకొస్తాడు. అలాంటి అతని జీవితంలో సడన్ గా అనేక సమస్యలు చుట్టుముడతాయి. స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం డబ్బులు కూడబెట్టాల్సివస్తుంది. ఈ క్రమంలో రూ.4 లక్షల కోసం అరకు వెళ్లి గంజాయి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. ఆ గంజాయి మూట చేతికి వచ్చాక అర్జున్ కి అనేక సమస్యలు ఎదురవుతాయి ? మరి ఆ సమస్యల నుంచి అర్జున్ ఎలా బయటపడ్డాడు ? అసలు ఆ మూట చుట్టూ ఉన్న కథేంటి? అనేది మిగిలిన కథ.
Also Read: ‘పుష్ప’లో ఈ సీన్ పడి ఉంటేనా..?
విశ్లేషణ :
శ్రీవిష్ణు తన ఫ్రెండ్ కోసం ఏం చేశాడు ? అనే కోణంలో రివీల్ అయ్యే ట్విస్ట్ లు, ఎమోషన్స్ అలాగే హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ బాగున్నాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మలుపులు, మరియి ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో హైలైట్ గా నిలిచాయి.
శ్రీవిష్ణు కూడా సినిమా సినిమాకి నటనలో మంచి ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాడు. తనదైన సహజమైన నటనతో అచ్చం గోదావరి కుర్రాడిలా ఆ యాసతో అలాగే ఆ నడవడికతో సెటిల్డ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ అమృత అయ్యర్ గ్రామ వాలంటీర్ గా కాస్త మాస్ గానే కనిపిస్తూ చక్కటి హావభావాలతో ఆకట్టుకుంది.
అయితే, సినిమా చూస్తున్నంత సేపు కథనం చాలా స్లోగా సాగుతుంది. పైగా చాలా సన్నివేశాలు బాగా బోరింగ్ ప్లేతో సాగుతాయి. ఇక సినిమాలో లాజిక్స్ కూడా లేవు. దానికి తోడు కథలోని మెయిన్ ఎమోషన్, అండ్ మెయిన్ పాయింట్ మోటివ్ సిల్లీగా అనిపిస్తాయి. అనవసర సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
సాంకేతిక వర్గం పని తీరు కూడా ఏవరేజ్ గానే ఉంది. అయితే, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
శ్రీవిష్ణు, మిగిలిన నటీనటులు నటన,
క్లైమాక్స్,
సంగీతం,
మైనస్ పాయింట్స్ :
బోరింగ్ ప్లే,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగాలేకపోవడం,
రెగ్యులర్ నేటివిటీలో రెగ్యులర్ ప్లే ఉండటం.
సినిమా చూడాలా ? వద్దా ?
కామెడీ టోన్ తో సాగే సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ “అర్జున ఫల్గుణ” చిత్రాన్ని ఒకసారి చూడోచ్చు. కాకపోతే, లాజిక్ లెస్ డ్రామాకి పరాకాష్టగా ఉండే ఈ సినిమా.. నేటి డిజిటల్ జనరేషన్ కి మరియు ఓటీటీ ప్రేక్షక లోకానికి మాత్రం నచ్చదు.
oktelugu.com రేటింగ్ 2/5
Also Read: ఆ విషయంలో సెంచరీ కొట్టిన సమంత… ఏంటంటే?