Arjun S/O Vyjayanthi Twitter reviews : అమిగోస్, డెవిల్ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరో గా నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'(Arjun S/O Vyjayanthi) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఎన్టీఆర్ అభిమానులు స్పెషల్ బెనిఫిట్ షోస్ ని ఏర్పాటు చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతీ ఒక్కరు ఈ సినిమాకు చాలా పాజిటివ్ టాక్ ని చెప్తున్నారు. చూస్తుంటే కళ్యాణ్ రామ్ ‘భింబిసారా’ చిత్రం తర్వాత మరో భారీ హిట్ కొట్టాడని అనిపిస్తుంది. ఈ చిత్రం ద్వారా ప్రదీప్ అనే కొత్త దరక్షకుడు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు, అతనికి మంచి లైఫ్ వచ్చినట్టే.
Good First Half
Action scenes #ArjunSonOfVyjayanthi https://t.co/Y0Phpxm82S— KLS (@KoneruLS) April 18, 2025
ప్రతీ ఒక్కరు ఫస్ట్ హాఫ్ లోని యాక్షన్ సన్నివేశాల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అదే విధంగా సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ మరియు యాక్షన్ అద్భుతంగా కుదిరిందని, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, విజయశాంతి(Vijayashanti) తల్లి కొడుకులు లాగా నటించలేదని, జీవించారని చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ఈ సినిమాలోని చివరి 15 నిమిషాలు చాలా ఎమోషనల్ గా ఉంటుందని, ఈమధ్య కాలం లో నేను కన్నీళ్లు పెట్టుకున్న ఎమోషనల్ సన్నివేశం ఇదేనంటూ ఎన్టీఆర్ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. నేడు సినిమాని చూసిన ఆడియన్స్ కూడా క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపించాడని అంటున్నారు. అయితే ఈ సినిమాని చూసిన వారిలో అధిక శాతం నందమూరి అభిమానులే ఉన్నారు. వాళ్ళ వైపు నుండి నెగటివ్ కామెంట్స్ ని ఆశించడం అత్యాశే అవుతుంది.
BLOCKBUSTER REPORTS From Premiere Shows. #ArjunSonOfVyjayanthi. Congratulations to @NANDAMURIKALYAN Anna pic.twitter.com/HGfDxrVPWu
— H A N U (@HanuNews) April 18, 2025
పోనీ మామూలు ఆడియన్స్ టాక్ తీసుకుందామా అనుకుంటే, వాళ్ళు ఇంకా ఈ సినిమాని చూసినట్టు అనిపించడం లేదు. కానీ ట్విట్టర్ కొంతమంది నందమూరి అభిమానులను నమొచ్చు . ఎందుకంటే వీళ్ళు ఎంత పెద్ద నందమూరి అభిమానులు అయినప్పటికీ బాగుంది అంటే బాగుందని అంటారు, బాగాలేకపోతే బాగాలేదని అంటారు. అలాంటి వాళ్ళు ఈ సినిమాకి మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. ఈమధ్య కాలం లో ఇలాంటి పర్ఫెక్ట్ కమర్షియల్ కమర్షియల్ సినిమా తీసారని అంటున్నారు. ఈ సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేదు, కానీ స్క్రీన్ ప్లే విషయం లో కాస్త కొత్తగా ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్. అంతే కాకుండా ఇప్పటి వరకు మనం తండ్రి కొడుకుల మధ్య క్లాష్ ఉన్న సినిమాలను చాలానే చూసాము, కానీ తల్లి కొడుకుల మధ్య క్లాష్ ఉన్న సినిమాలను ఇప్పటి వరకు చూడలేదు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రం ఆ లోటుని భర్తీ చేసింది.
Just now watched the movies first half good and second half is excellent emotions worked very well Blockbuster movie #ArjunSonOfVyjayanthi pic.twitter.com/YjO96lB3bW
— CMTarakMainFanPage (@tarakdevote9998) April 18, 2025
Blockbuster talk from early shows @NANDAMURIKALYAN nailed it. Peak performance.
Congratulations #ArjunSonOfVyjayanthi whole team
— Amaravati_Techie (@Amaravati_IT) April 18, 2025
NANDAMURI @NANDAMURIKALYAN and man of masses @tarak9999 fans mass celebrations at BHRAMARAMBHA THEATER ❤️❤️❤️#ArjunSonOfVyjayanthi #NandamuriKalyanRam #Devara #NTR #NTRNeel pic.twitter.com/vJskHteQTs
— Telugu Cult (@Telugu_Cult) April 18, 2025