Arjun S/O Vyjayanthi : పబ్లిసిటీ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టుగా తయారు అయ్యాయి రీసెంట్ గా విడుదలైన కొన్ని సినిమాలు. ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) నటించిన ‘అర్జున్ S/O వైజయంతి'(Arjun S/O Vyjayanthi) చిత్రం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanti) ఒక కీలక పాత్ర పోషించింది. సినిమా మొత్తం కళ్యాణ్ రామ్, విజయ శాంతి మధ్యనే ఉంటుంది. తల్లికొడుకులుగా అద్భుతంగా నటించి ఆడియన్స్ ని ఎమోషనల్ చేయడం లో సక్సెస్ అయ్యారు. కానీ మొదటి నుండి ఈ సినిమా ఆడియన్స్ కి రొటీన్ కమర్షియల్ సినిమా లాగా అనిపించడంతో థియేటర్స్ కి కదిలి వెళ్లేందుకు మొగ్గు చూపించలేదు. ఫలితంగా ఓపెనింగ్స్ నామ మాత్రంగానే వచ్చాయి. మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో దాదాపుగా లక్ష టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇవంతా కేవలం నందమూరి అభిమానుల వల్ల వచ్చింది అనుకోవచ్చు.
Also Read : మరో చారిత్రాత్మక రికార్డుని నెలకొల్పిన ‘చావా’..10 వ వారం వచ్చిన వసూళ్లు ఎంతంటే!
ఎందుకంటే సాధారణ సినీ ప్రేమికులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు అనేది వాస్తవం. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 22 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, మూడు రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టింది?, కళ్యాణ్ రామ్ చెప్పినట్టుగా మంగళవారం, లేదా బుధవారం లోపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది చూడాలి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజున కేవలం కోటి 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. అంటే ఆదివారం కూడా ఈ సినిమా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి నాలుగు కోట్ల 83 లక్షల రూపాయిలు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా+ కర్ణాటక+ ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 5 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అసలు సరిపోదు. ఒక్కమాటలో చెప్పాలంటే డిజాస్టర్ కా బాప్ దిశగా ఈ సినిమా అడుగులు వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి హీరో కళ్యాణ్ రామ్ ఏమో మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పాడు. ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ సినిమాకు విడుదలకు ముందు కేవలం 7 కోట్ల రూపాయిల బిజినెస్ మాత్రమే జరిగి ఉండాలి. కానీ అలా జరగలేదని స్పష్టంగా ట్రేడ్ నుండి అందుతున్న సమాచారం. సోమవారం నుండి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతాయని అంతా అనుకున్నారు. కానీ మార్నింగ్ షోస్ కి వచ్చిన ఆక్యుపెన్సీ ని చూస్తుంటే ఇంకో రెండు కోట్ల రూపాయలకు మించి ఒక్క రూపాయిల కూడా వచ్చేలా లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : మహేష్ బాబు, దీపికా పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా?