Arjun Das: వాయిస్ తో ఫేమస్ అయిన ఈ నటుడు ఎవరో తెలుసా?

తెలుగులో ‘బుట్టబొమ్మ’ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు శౌరి చంద్ర శేఖర్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆయకు మొదటిది.

Written By: Chai Muchhata, Updated On : March 14, 2024 1:33 pm

Arjun das

Follow us on

Arjun Das: సినిమాల్లో రాణించడం నేటి కాలంలో చాలా కష్టం. ఒకవేళ అవకాశం వచ్చినా.. ఒకటి, రెండు సినిమాల్లో కనిపించి ఆ తరువాత దూరమవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో మంది ఇండస్ట్రీకి రావడతో ఎవరికీ ప్రత్యేక గుర్తింపు రావడం లేదనే చెప్పవచ్చు. కొన్ని సినిమాల్లో హీరోగానటించినా.. ఆ తరువాత వారిని పట్టించుకునేవారు కరువయ్యారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఓ నటుడు ఇప్పుడు హీరో లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అతని వాయిస్ తో ఆకట్టుకొని ప్రేక్షకాదరణ పొందాడు. అతని గురించి వివరాల్లోకి వెళితే..

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అర్జున్ దాపు పేరు హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లోకి రావాలన్న కోరిక తనకు కూడా ఉండేది. కానీ ఎన్నో అడ్డంకుల మధ్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన లక్ష్యాన్ని చేరుకోబోతున్నాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాల్లో సైడ్ పాత్రలను చేసిన ఆయన ఇప్పుడు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఆయన సైడ్ పాత్రలు చేసినా అతని వాయిస్ తో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలో నే ఎక్కువ పాపులారిటీ సాధించిన అర్జున్ దాస్ పర్సనల్ విషయాల్లోకి వెళితే..

తమిళనాడులోని చెన్నైలో జన్మించిన అర్జున్ దాస్ చిన్నప్పటి నుంచి క్లెవర్ బాయ్. అయితే అతనికి సినిమాల్లో నటించడం చాలా ఇష్టం. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ముందుగా ఫైనాన్షియల్ గా స్థిరపడాలనుకున్నాడు. దీంతో బాగా చదువుకొని దుబాయ్ లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ కొన్నాళ్ల పాటు లక్షల్లో జీతం అందుకున్నాడు. ఆ తరువాత ఇండియాకు వచ్చి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అయనకు ‘పెరుమాన్’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అవకాశాలు రాలేదు. కానీ కార్తీ నటించిన ‘ఖైదీ’ లో అవకాశం వచ్చిన తరువాత అర్జున్ దాస్ కెరీర్ టర్న్ అయింది. ఇందులో విలన్ పాత్రలో నటించిన అర్జున్ తన వాయిస్ తో ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత మాస్టర్ విక్రమ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అలా తమిళ్ లో 7 సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల్లో అర్జున్ దాస్ సైడ్ పాత్రలే చేశారు. కానీ అతనికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

ఇదే క్రమంలో తెలుగులో గోపీచంద్ ‘ఆక్సిజన్’ సినిమాలో నటించాడు. ఇప్పుడు ఆయనకు తెలుగులో హీరోగా నటించే అవకాశం వచ్చింది. తెలుగులో ‘బుట్టబొమ్మ’ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు శౌరి చంద్ర శేఖర్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆయకు మొదటిది. మరి అర్జున్ దాస్ హీరోగా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.