Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ ఎవరూ ఊహించని పరిణామం. సంధ్య థియేటర్ ఘటన జరిగిన వారం రోజుల అనంతరం అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఏ 11గా అల్లు అర్జున్ పేరు చేర్చారు. క్రిమినల్ కేసులు అల్లు అర్జున్ పై నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని ప్రవేశ పెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టులో అల్లు అర్జున్ కి ఊరట లభించింది. నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
దాంతో సాయంత్రానికి అల్లు అర్జున్ ఇంటికి వచ్చేస్తారని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆర్డర్ కాపీ అందలేదన్న నెపంతో జైలు అధికారులు అల్లు అర్జున్ ని విడుదల చేయలేదు. నేడు ఉదయం అల్లు అర్జున్ విడుదల అవుతాడని వెల్లడించారు. అల్లు అర్జున్ రాక కోసం కూతురు అర్హ పడిగాపులు పడింది. ఆమె ఇంటి పై ఫ్లోర్ నుండి రోడ్డు వైపు ఆతృతగా ఎదురు చూసింది. అర్హ తండ్రి కోసం నిరీక్షిస్తున్న ఎమోషనల్ వీడియో వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ కి పిల్లలతో ఎనలేని అనుబంధం ఉంది. ఖాళీ సమయం దొరికితే అర్హ, అయాన్ లతో ఆయన సరదాగా ఆడుకుంటారు. సమయం గడుపుతారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారన్న న్యూస్… కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను ఆందోళనకు గురి చేసింది. విడుదలయ్యాక అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. నేను క్షేమంగా ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేవతి మృతి బాధాకరం. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కేసు కోర్టులో ఉంది. దాని గురించి నేనేమి మాట్లాడలేను, అన్నారు.
బెయిల్ వచ్చినా ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ ని జైల్లో ఉంచారనే వాదన ఉంది. దీనిపై అల్లు అర్జున్ లీగల్ టీం సీరియస్ అయ్యిందట. చర్యలకు సిద్ధం అవుతున్నారని సమాచారం.
#alluarha waiting for her Dad #AlluArjun #alluaarjunarrest pic.twitter.com/pkWDdYQGjA
— SRK (@SRKofficial67) December 13, 2024