https://oktelugu.com/

Allu Arjun Arrested: అల్లు అర్జున్ అరెస్ట్ ఎఫెక్ట్..అమాంతం పెరిగిపోయిన ‘పుష్ప 2’ వసూళ్లు..9వ రోజు ఎంత వసూళ్లు వచ్చాయో తెలుసా!

సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీలలో సినిమాలకు శుక్రవారం ఫస్ట్ షో నుండి మంచి వసూళ్లు వస్తుంటాయి. ఎందుకంటే వీకెండ్ మొదలయ్యేది అప్పటి నుండే కాబట్టి. ఈ సినిమాకి కూడా నిన్న సాయంత్రం నుండి ప్రధాన నగరాల్లో ముందు రోజుతో పోలిస్తే వసూళ్లు బాగా పెరిగాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 14, 2024 / 12:01 PM IST

    Allu Arjun Arrested(28)

    Follow us on

    Allu Arjun Arrested: సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నిన్న అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఆయన నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో సంచలన రికార్డుని సృష్టిస్తూ, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ ముందుకు దూసుకుపోతుంటే, మరోపక్క ఈ ఘటన జరగడంపై ఆయన అభిమానులు తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేసారు. పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తుంది. అయితే జనాలు మొత్తం ఈ వార్తల్లో మునిగిపోవడం వల్ల ‘పుష్ప 2’ వసూళ్లపై ఏమైనా ప్రభావం పడుతుందేమో అని అనుకున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ అనుకున్నట్టుగానే ఆ సినిమాపై గట్టి ప్రభావమే పడింది. కానీ అది నెగటివ్ అవ్వలేదు, పాజిటివ్ అయ్యింది. నిన్నటి రోజున ఈ చిత్రానికి వసూళ్లు బాగా పెరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 9వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాము.

    సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీలలో సినిమాలకు శుక్రవారం ఫస్ట్ షో నుండి మంచి వసూళ్లు వస్తుంటాయి. ఎందుకంటే వీకెండ్ మొదలయ్యేది అప్పటి నుండే కాబట్టి. ఈ సినిమాకి కూడా నిన్న సాయంత్రం నుండి ప్రధాన నగరాల్లో ముందు రోజుతో పోలిస్తే వసూళ్లు బాగా పెరిగాయి. అనేక చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. దీంతో నైజాం లో ఈ చిత్రానికి 9 వ రోజు దాదాపుగా మూడు కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ వసూళ్లు వచ్చింది. అలా 9 రోజులకు కలిపి ఈ ప్రాంతంలో దాదాపుగా 78 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. అదే విధంగా నిన్న ఆంధ్ర ప్రదేశ్, సీడెడ్ ప్రాంతాలకు కలిపి కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని, ఓవరాల్ గా 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 4 కోట్ల 64 లక్షల రూపాయిలు వచ్చాయని, 8వ రోజుతో పోలిస్తే 5 లక్షలు ఎక్కువ వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

    అదే విధంగా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి వసూళ్లు మొన్నటితో పోలిస్తే నిన్న ఎక్కువ వచ్చాయి. దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చి ఉంటుందని అంచనా. మొత్తం మీద నిన్న ఒక్కరోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ సినిమాకి 1138 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఈ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 1300 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ వీకెండ్ తర్వాత క్లోజింగ్ పడబోతుందట. ఎందుకంటే అక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రం విడుదల కాబోతుంది. షోస్ మొత్తం ఆ సినిమాకే కేటాయిస్తున్నారట. ఇది కాస్త ‘పుష్ప 2’ పై ప్రభావం చూపించనుంది.