Karan Johar: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు సినిమా హవానే నడుస్తుంది. మొన్నటిదాకా బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ సినిమాను శాసిస్తూ వచ్చేది. కానీ ఒక్కసారిగా బాహుబలి సినిమా రావడం తో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్టు కొట్టిందో అప్పటినుంచి తెలుగు సినిమాల స్టామినా ఏంటో పాన్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీ లకు తెలిసి వచ్చింది. ఇక దాంతో పాన్ ఇండియా లో తెలుగు సినిమాల హవా మొదలైంది. ఇక అప్పటినుంచి బాలీవుడ్ హీరోల హవా తగ్గడం షురూ అయింది. ఇక దాంతో అక్కడున్న ప్రొడ్యూసర్లు ఆ హీరోలని నమ్ముకుంటే లాభం లేదనే ఉద్దేశ్యం తో తెలుగు హీరోల సినిమాలపై ప్రొడ్యూస్ చేసి భారీ ఎత్తున లాభాలను గడిస్తున్నారు.
ఇక ఇప్పటికే కరణ్ జోహార్ లాంటి ప్రొడ్యూసర్ అయితే తెలుగు లో చేస్తున్న సినిమాలని బాలీవుడ్ లో రిలీజ్ చేసి భారీ ఎత్తున లాభాలను గడిస్తున్నాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాని తనే హిందీలో రిలీజ్ చేశాడు. రెండు పార్ట్ లకి కలిపి దాదాపు 4 నుంచి 5 వందల కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టుకున్నాడు. ఇక దాంతో అప్పటినుంచి తెలుగు సినిమాల మీదనే తన దృష్టిని పెడుతూ పాన్ ఇండియా లో వచ్చే చాలా సినిమాలను కొనుగోలు చేసి హిందీ లో రిలీజ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు…ఇక దీని ద్వారా ఆయన సినిమాకి ప్రొడ్యూస్ చేయకుండానే ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసి భారీ ఎత్తున డబ్బులను పోగేసుకుంటున్నాడు.
ఇక ఇదంతా చూస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు బాలీవుడ్ హీరోల పని అయిపోయింది అందువల్లే కరణ్ జోహార్ లాంటి ప్రొడ్యూసర్లు మిగతా భాషల హీరోల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఇది తెలిసిన మన తెలుగు ప్రొడ్యూసర్లు కూడా మనం సినిమా చేసి వాళ్ళకి లాభాలు తెచ్చి పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మనమే అక్కడ రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ధోరణిలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక రీసెంట్ గా ఎన్టీయార్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా రైట్స్ ని కూడా కరణ్ జోహార్ తీసుకోవడం విశేషం.. ఇక ఫ్యూచర్లో ఆయన మనవాళ్లు డైరెక్ట్ గా హిందీలో సినిమాని రిలీజ్ చేసుకొని వచ్చిన లాభాన్ని మన తెలుగు ప్రొడ్యూసర్లు వాడుకోవాలనే ఉద్దేశ్యం లో ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది…