SS Rajamouli : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో కలిసి ఒక మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి తనకు శంకర్ అంటే చాలా ఇష్టమని ఆయన సినిమాలు చూసే నేను కూడా లాంటి సినిమా చెలని అనుకున్నాను అని రాజమౌళి చెబుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఆయన సినిమాల వల్లే తను ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యానని తెలియజేశాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళికి శంకర్ అంటే ఎందుకంత ఇష్టం పెరిగింది అంటే దానికి కారణం బాలీవుడ్ హీరోలనే చెప్పాలి.
ముఖ్యంగా ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు చిన్న చూపు చూసే వాళ్ళు అక్కడ హీరోలు సౌత్ హీరోలను గాని, దర్శకులను గానీ పట్టించుకునేవారు కాదు. ఇక అలాంటి సమయంలో శంకర్ భారీ ఎక్స్పరమెంటల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా బాలీవుడ్ హీరోలను సైతం ఆకట్టుకునే విధంగా తన మేకింగ్ తో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించాడు.
అందుకే రాజమౌళికి శంకర్ అంటే చాలా ఇష్టం. అప్పుడున్న బాలీవుడ్ వాళ్ళ పొగరును దించిన వారిలో శంకర్ మొదటి స్థానంలో ఉంటాడు. కాబట్టి ఆయన వేసిన బాటలోనే తను కూడా నడిచాను అని చెప్పాడు. ఇక బాహుబలి సినిమాతో మంచి విజయాన్ని అందించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి….
అయితే ఈయన సౌత్ సినిమా ఇండస్ట్రీ తలుచుకుంటే ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాయి అనే విషయాన్ని కూడా బాలీవుడ్ హీరోలకు తెలిసేలా చేశాడు. ఇక మొత్తానికైతే అటు శంకర్, ఇటు రాజమౌళి ఇద్దరూ కలిసి సౌత్ సినిమా స్థాయిని పెంచిన దర్శకులనే చెప్పాలి. వీళ్ళిద్దరూ అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చాలా రెస్పెక్ట్ అయితే ఉంటుంది…