Pawan Kalyan: తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్…ఆయన నటనకి భక్తులు గా మారిన అభిమానులు చాలామంది ఉన్నారు. అలాగే ఆయన పేరు చెబితే ఊగిపోయే ఫ్యాన్స్ కోట్ల సంఖ్యలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ తను చేసే సినిమాల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడనే చెప్పాలి. నిజానికి రాజకీయంగా తన మనుగడ సాగించడానికి సినిమాల్లో వచ్చే డబ్బులే ఆయనకి ఆధారంగా నిలుస్తున్నాయని ఇప్పటికి ఆయన చాలా ఇంటర్వ్యూ ల్లో కూడా చెప్పడం మనం చూశాం…
ఇక ఇదిలా ఉంటే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆయనకి హీరోగా అంత గుర్తింపు అయితే రాలేదు. కానీ ఆ తర్వాత ఆయన్ని స్టార్ హీరోగా మార్చడంలో ముగ్గురు దర్శకులు మాత్రం కీలకపాత్ర వహించారు. అందులో తొలి ప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ కి మొదటి బ్లాక్ బాస్టర్ హిట్టిచ్చిన కరుణాకరన్ ఒకరైతే, ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ బద్రి సినిమాతో తన ఆటిట్యూడ్ తో ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ ని దగ్గర చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించిన స్టైల్ కి తెలుగు సినిమా అభిమానులు అందరూ ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా, కొత్తగా కనిపిస్తాడు. “మెడ దగ్గర చేయి పెట్టుకుని స్టైల్ గా ఆయన చేసే మ్యానరిజం ఈ సినిమా నుంచే మొదలైంది”.
ఆ స్టైల్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమాతో ‘పవర్ స్టార్’ గా తన పంజా దెబ్బ ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి రుచి చూపించాడు. ఇక అప్పటివరకు నార్మల్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టి చిరంజీవితో సైతం పోటీ పడే రేంజ్ కు ఎదిగాడు.
ఇక ఆ స్టార్ డమ్ ని కంటిన్యూ చేస్తూ వచ్చిన దర్శకులలో త్రివిక్రమ్, హరీష్ శంకర్ లు వాళ్ల తర్వాత స్థానంలో ఉంటారు. కానీ ముఖ్యంగా కరుణాకరన్, పూరి జగన్నాథ్, ఎస్ జె సూర్యలు మాత్రం పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా మార్చడంలో కీలకపాత్ర వహించారు…