Nagarjuna And Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్లని స్టార్లుగా మార్చడానికి వాళ్ల నాన్నలు చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు చేసిన కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటిస్తూ సినిమా మీద మంచి బజ్ ను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తు ఉంటారు. ఇక అందులో భాగంగా నాగేశ్వరరావు, కృష్ణ లాంటి స్టార్ హీరోలు సైతం మొదట్లో వాళ్ల కొడుకులు చేసిన కొన్ని సినిమాల్లో కీలక పాత్ర లో నటించి వాళ్ల సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చారు… అయితే వీళ్ళు నటించిన సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కెరియర్ మొదట్లో నాగార్జున హీరోగా వచ్చిన కలెక్టర్ గారి అబ్బాయి, ఇద్దరు ఇద్దరే లాంటి సినిమాల్లో నాగార్జునకు తండ్రిగా నాగేశ్వర రావు నటించి ఆ సినిమాల్ని సక్సెస్ తీరాలకు చేర్చడంలో చాలా వరకు ప్రయత్నం చేశాడనే చెప్పాలి. మొదట్లో నాగార్జున చాలా సన్నగా ఉన్నాడు, ఆయనకు యాక్టింగ్ సరిగ్గా రావడం లేదు అంటూ చాలా విమర్శలు అయితే వచ్చాయి. ఇక ఈ విమర్శలకు చెక్ పెట్టడానికి నాగేశ్వరరావు రంగంలోకి దిగి నాగార్జున కెరీర్ ని గాడీ లో పెట్టడానికి కొన్ని పాత్రల్లో నటించి ఆ సినిమాల మీద మంచి బజ్ ను క్రియేట్ చేశాడు. దాని ఫలితంగా నాగార్జున స్టార్ హీరోగా మారాడు…
ఇక సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చేసిన మొదటి సినిమా అయిన రాజకుమారుడులో కూడా కృష్ణ మహేష్ బాబు తండ్రిగా నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత బి. గోపాల్ దర్శకత్వంలో నమ్రత మహేష్ బాబు కలిసి నటించిన వంశీ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ని చవి చూసింది.
ఇక మోహన్ బాబు కూడా తన కొడుకుల కెరియర్ ను చక్కబెట్టడానికి మొదట్లో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ సినిమాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. విష్ణు తో గేమ్ అనే సినిమాలో కలిసి నటించాడు. అలాగే మనోజ్ తో శ్రీ అనే సినిమా లో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు. కానీ ఆ సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు…