https://oktelugu.com/

Sukumar and Chiranjeevi : సుకుమార్ చిరంజీవి కోసం రాసుకున్న కథ ముందు ఇంద్ర ఠాగూర్ ఏం పనికి రావు…ఆ సినిమా ఎప్పుడు వస్తుందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. మరి తమదైన రీతిలోనే సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్లు మరోసారి తమను తాము స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : January 4, 2025 / 12:34 PM IST

    Sukumar , Chiranjeevi

    Follow us on

    Sukumar and Chiranjeevi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నప్పటికి ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు మాత్రం సుకుమార్ గారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయడానికి ఒక పవర్ ఫుల్ స్టోరీని కూడా రెడీ చేసుకున్నారట. ఆయన కెరియర్ లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ లాంటి సినిమాలను మించి ఈ సినిమా కథ ఉంటుంది అంటూ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ తెలియజేశాడు. మరి మొత్తానికైతే సుకుమార్ రాసుకున్న కథ వింటేజ్ చిరంజీవిని చూపించే విధంగా ఉండడమే కాకుండా ఇప్పటివరకు ఏ సీనియర్ హీరో చేయనటువంటి ఒక విభిన్నమైన పాత్రలో తనను చూపించాలి అనుకున్నారట. కానీ ఇటు సుకుమార్ అటు చిరంజీవి ఇద్దరు బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతానికి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి రాబోతుందనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి మొత్తానికైతే సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా పేరును సంపాదించుకున్నాడు.

    కాబట్టి అతనితో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…కానీ ఆయన మాత్రం తెలుగు స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తోనే మరోసారి జతకడుతూ ఉండటం విశేషం… యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆనందింపచేసేలా సినిమాలు చేస్తున్నాడనే చెప్పాలి.

    ఇక ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం ‘ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నటుడుగా ఆయనకి చాలా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. మరిలాంటి సందర్భంలోనే రామ్ చరణ్ తో చేస్తున్న ఈ సినిమాతో మరోసారి ఆయనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా నటుడిగా రామ్ చరణ్ కి కూడా చాలా వైవిధ్యమైన ఇమేజ్ వస్తుందని తను చెబుతున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు మరోసారి వాళ్లను వాళ్లు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక సుకుమార్ రామ్ చరణ్ తో తన రెండోవ సినిమా చేస్తున్నాడు. కాబట్టి మెగా ఫ్యాన్స్ అయితే ఆనందంలో ఉన్నారు. ఇక చిరంజీవితో ఆయన సినిమా ఎప్పుడు చేస్తాడనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…