Pawan Kalyan huge craze: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ గొప్ప గుర్తింపైతే ఉంటుంది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ ఇమేజ్ ను కట్టబెట్టడమే కాకుండా ప్రస్తుతం ఇండియాలో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఆయన సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇండియా వైడ్ గా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాడు. మూడు సంవత్సరాల కిందటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలకు తెలుగులో గొప్ప క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియాలో కూడా ఆయనకు మంచి గుర్తింపైతే లభిస్తోంది. ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాలను కూడా అదే రేంజ్ లో సూపర్ సక్సెసుగా నిలపాలనే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు.
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించేది చాలా తక్కువ సమయమే అయినప్పటికి ఆయన కారెక్టర్ గానీ, దర్శకుడు ఆ క్యారెక్టర్ ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ ను అందించుటకు అతనికంటూ ఒక స్టైల్ ను సంపాదించి పెట్టిన సినిమా ఏంటి అంటే బద్రి… పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కిన బద్రి సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది…
తద్వారా ఆయనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ రావడమే కాకుండా తను మాస్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కి థియేటర్లో పూనకాలు వచ్చాయనే చెప్పాలి… మొత్తానికి పవన్ కళ్యాణ్ కెరియర్ ను మార్చేసే సినిమా ఏదైనా ఉంది అంటే అది బద్రి సినిమా అనే చెప్పాలి…
ఇక పవన్ కళ్యాణ్ సైతం ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆడపదడప సినిమాలు చేసి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయాలని చూస్తున్నాడు. ఆయనను కరెక్టుగా వాడుకుంటే ఆయన పాన్ ఇండియాలో సైతం స్టార్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం ఆయన సినిమాలు భారీ డిజాస్టర్లను మూట గట్టుకుంటాయి…ఇక తనను వాడుకోవడం అందరి వల్ల కాదు. అందుకే పవన్ కళ్యాణ్ కి సక్సెసులు ఇచ్చిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు…