https://oktelugu.com/

Tollywood : ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి రేసులో ఉన్నారా..?ఈసారి రచ్చ మామూలుగా ఉండేలా లేదుగా…

ప్రస్తుతం సినిమా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్య భాగం అయిపోయింది. అందుకే సంతోషం తో ఉన్న, బాధలో ఉన్న ప్రతి ఒక్కరు సినిమాను చూసి రిలాక్స్ అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అందువల్లే డిఫరెంట్ ప్లాట్ ఫామ్స్ ద్వారా సినిమా అనేది ప్రేక్షకుడికి అందుబాటులోకి వచ్చి వాళ్ళని ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : October 8, 2024 / 08:15 PM IST

    Tollywood Top Heros

    Follow us on

    Tollywood : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.. ఇక అదే విధంగా మన హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి వారు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకే వాళ్ళ సినిమాలను పరిమితం చేస్తున్నారు. చిరంజీవి మాత్రం విశ్వంభర సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి బరిలో ఇప్పుడు భారీ సినిమాలలు నిలవబోతున్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా అలాగే బాలయ్య బాబు, బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా, ఇక వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలువబోతున్నట్లుగా తెలుస్తుంది.

    మరి ఈ మూడు సినిమాలతో సీనియర్ హీరోలు ముగ్గురు ఒకేసారి పోటీ పడబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి వీళ్ళలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ముఖ్యంగా చిరంజీవి సంక్రాంతి పండుగను బేస్ చేసుకొని ప్రతిసారి తన సినిమాలను రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉంటాడు. ఇక 2024 సంవత్సరంలో చిరంజీవి రాకపోయినప్పటికీ, 2023 వ సంవత్సరంలో సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు.

    అలాగే బాలయ్య బాబు కూడా వీర సింహారెడ్డి సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకోవడం విశేషం… ఇంకా ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి వీళ్ళతో పాటు వెంకటేష్ కూడా పోటీకి రావడం ఇప్పుడు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి.

    ఇక ముఖ్యంగా పండుగ సీజన్ ను బేస్ చేసుకొని ఈ సినిమా వస్తే మాత్రం ప్రేక్షకులందరు ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ముగ్గురు సీనియర్ల లో ఎవరు పై చేయి సాధిస్తారనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. వీళ్ళ ముగ్గురి సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ ముగ్గురికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండటం విశేషం…