OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ను చూపిస్తూ ఓజీ సినిమా నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. మరి ఈ ట్రైలర్ ని కనక మనం చూసినట్లయితే ఇందులో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. అలాగే చాలా వైల్డ్ రేంజ్ లో దర్శనమిచ్చాడు. ఇప్పటివరకు ఆయన్ని ఈ రేంజ్ లో ఏ దర్శకుడు చూపించలేదు అనేంతగా ట్రైలర్ నైతే ఎలివేట్ చేసి చూపించారు. ఇక దర్శకుడు సుజీత్ సైతం ఈ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో ఒక నాలుగు ఎలివేషన్స్ సీన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయట… ఇప్పటివరకు ఎవ్వరికి పడినటువంటి గొప్ప ఎలివేషన్స్ అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి పడ్డట్టుగా తెలుస్తున్నాయి.
ఇక అందులో మొదటిది ఇంట్రాడక్షన్ సీన్, అలాగే జనాలు ఓజీ కోసం ఇక్కడున్న ఎదురు చూస్తున్నప్పుడు అతను ముంబైలోకి అడుగుపెట్టే ఒక ఎలివేషన్ అద్భుతంగా పేలబోతుందట… ఇక దీనికి మాత్రం థియేటర్లో పూనకాలు రాబోతున్నాయి అంటూ గతంలో తమన్ అయితే చెప్పాడు. ఇక దాంతో పాటుగా ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట.
అంతకు మించిన క్లైమాక్స్ అయితే ఉంటుందట. మొత్తానికైతే ఈ నాలుగు మాత్రం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతున్నాయి అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ట్రైలర్ ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి వెళ్లిపోయాయి. మరి అంచనాలను అందుకుంటుందని చెప్పడానికి ఈ నాలుగు ఎపిసోడ్లు ఉదాహరణగా చెబుతూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.
ఈ నాలుగు సీక్వెన్స్ లో ఇంటర్వెల్ ఫైట్ సలార్ లోని కాటేరమ్మా ఫైట్ ను మించి ఉంటుందని మొత్తం రక్తపాతంతోనే ఈ ఫైట్ సాగబోతుందని అలాగే ఇందులో ప్యూర్ ఎమోషన్ కూడా ఉంటుందని సుజీత్ గతంలో తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది ఇటు పవన్ కళ్యాణ్ కి, అటు సుజీత్ కి చాలా కీలకమనే చెప్పాలి…