Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ ప్రస్తుతం తమదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక కొంతమంది దర్శకులు మాత్రం చాలామంది హీరోలతో సినిమాలు చేసినప్పటికీ వాళ్లకు సరైన సక్సెస్ లు రావు. ఇక వాళ్లకి బాగా అచ్చొచ్చిన హీరోతో సినిమా చేసినప్పుడు మాత్రమే వాళ్ళు సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటారు. అయితే అలాంటి దర్శకులు సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
బోయపాటి శ్రీను
బోయపాటి శీను భద్ర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత కూడా ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను దక్కించుకున్నప్పటికీ ముఖ్యంగా ఈయన బాలయ్య బాబుతో చేసిన సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు మాత్రం భారీ సక్సెస్ ని సాధించాయి. ముఖ్యంగా ఆయన ఎవరికి సక్సెస్ ఇచ్చిన ఇవ్వకపోయిన బాలయ్యకి మాత్రం బ్లాక్ బస్టర్ ఇస్తాడు. ఇక బాలయ్య బాబుతో బోయపాటి జతకడుతున్నాడు అంటే మాత్రం వీళ్ళ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఆ సినిమాలను చిత్రీకరించి వాటిని విజయతీరాలకు చేర్చడంలో చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు…
వెట్రి మారన్
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో వెట్రి మారన్ ఒకరు. ఈయన ధనుష్ తో చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి. మిగిలిన వాళ్ళతో చేసిన సినిమాలు అడపదడప తడబడ్డప్పటికీ ధనుష్ తో చేసిన సినిమాలు మాత్రం సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఆడు కాలం, వడ చెన్నై, అసురున్ లాంటి మూడు భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రావడం విశేషం…
గోపీచంద్ మలినేని
తెలుగులో కమర్షియల్ దర్శకుడి గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన చేసిన సినిమాలన్నింటిలో రవితేజతో చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ముందుగా ఈయన డాన్ శీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత రవితేజ గోపీచంద్ కాంబినేషన్ లోనే బలుపు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇక అదే రీతిలో వీళ్ళ కాంబోలో క్రాక్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది…
ఇలా కొంతమంది దర్శకులు హీరోలతో చాలా మంచి బాండింగ్ అయితే కలిగి ఉంటారు. దానివల్ల వాళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలుపుతూ ఉంటారు…