Rishab Shetty: కన్నడ సినిమా ఇండస్ట్రీలో ‘కాంతార’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ‘రిషబ్ శెట్టి’…ఆ సినిమాలో హీరోగా పెద్ద బాధ్యతను మోస్తూనే దర్శకత్వం కూడా చేశాడు. ఇక ఆ సినిమా పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డు లను క్రియేట్ చేసింది. ఇప్పుడు ‘కాంతారా చాప్టర్ 1’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంది… రిషబ్ శెట్టి అటు నటుడిగా ఇటు దర్శకుడిగా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా చేస్తూనే, ఆ సినిమాకి దర్శకత్వం వహించి సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపే వాళ్ళు కరువయ్యారు. నిజానికి తెలుగులో ఉన్న స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా దర్శకత్వం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ని చూపించడం లేదు. కారణం ఏంటి అంటే హీరోగా రాణిస్తున్నాం. కాబట్టి మళ్లీ కొత్త రకం బాధ్యతను ఎత్తుకుంటే దానికోసం కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపలేకపోతే భారీ విమర్శలను అందుకోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే చాలామంది హీరోలు సినిమాలను డైరెక్ట్ చేయడం లేదు.
ఇక రిషబ్ శెట్టి మాత్రం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనని చూసైనా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే నటులు దర్శకులుగా మారితే బాగుంటుంది…దీని వల్ల ఉపయోగం ఏమిటంటే దర్శకుడిగా సినిమాకి ఏం కావాలో తనకు తెలుస్తోంది.
కాబట్టి నటుడు కూడా తనే కావడం వల్ల తను అనుకున్నట్టుగా సినిమాని తీయొచ్చు.. కొత్త కథలను ఇండస్ట్రీకి తీసుకువచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం రిషబ్ శెట్టి తెలుగు దర్శకులు చేసే సినిమాల్లో కూడా నటిస్తూ ఉండడం విశేషం…
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్టుగా ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా రిషబ్ శెట్టి సైతం ఆ సినిమాకి డేట్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తోంది…