https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: బిగ్‌ బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్లు వీళ్లేనా ?

Bigg Boss Telugu OTT: బిగ్‌ బాస్ ఓటీటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్టు కూడా ప్రిపేర్ అయిందట. ఈ షోలో పాల్గొనబోయేది వీళ్లేనంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ షో ఓటీటీ వేదికగా 24*7 ప్రసారం కానుండటం విశేషం. ఇంతకీ సభ్యులు ఎవరంటే ? ఆదర్శ్ బాలకృష్ణ, మహేశ్ విట్ట, అరియానా, సరయు, అషూరెడ్డి, అఖిల్, నటరాజ్ మాస్టర్, తేజశ్విని, యువ హీరో అర్జున్, యాంకర్లు శివ, స్రవంతి తదితరుల పేర్లు బలంగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 15, 2022 / 03:11 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: బిగ్‌ బాస్ ఓటీటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్టు కూడా ప్రిపేర్ అయిందట. ఈ షోలో పాల్గొనబోయేది వీళ్లేనంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈ షో ఓటీటీ వేదికగా 24*7 ప్రసారం కానుండటం విశేషం. ఇంతకీ సభ్యులు ఎవరంటే ? ఆదర్శ్ బాలకృష్ణ, మహేశ్ విట్ట, అరియానా, సరయు, అషూరెడ్డి, అఖిల్, నటరాజ్ మాస్టర్, తేజశ్విని, యువ హీరో అర్జున్, యాంకర్లు శివ, స్రవంతి తదితరుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

    Bigg Boss Telugu OTT

    ఏది ఏమైనా బిగ్ బాస్ అంటేనే ఎమోషనల్ డ్రామా. కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఉంటుంది. అసలు హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య హోరాహోరీగా గేమ్ సాగుతుంటే, దానికి సరిసమానంగా బయట మరో గేమ్ నడుస్తుంది. ఎవరికి వారు తమ అభిమాన కంటెస్టెంట్స్ తరపున ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. సదరు కంటెస్టెంట్ కి ఓటు వేయాలంటూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తుంటారు.

    Also Read: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో రామ్ చరణ్ ?

    ఓ రకంగా మినీ ఎలెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే.. ఈ షో పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. దీనికితోడు ‘అన్ స్టాపబుల్, మీలో ఎవరు కోటేశ్వర్లు, బిగ్ బాస్’ ఇలా అన్నీ రకాల షోలతో మన స్టార్స్ యాంకరింగ్ లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది హీరోలు ఇలాంటి హోస్ట్ రోల్స్ లో మన ముందుకి రాబోతున్నారు.

    Bigg Boss Telugu OTT

    నిజంగా ఇది బుల్లితెర పై ఉత్తేజకరమైన అంశం. అందుకే బిగ్ బాస్ షోకి కూడా బాలయ్య హోస్ట్ గా చేస్తే బాగుంటుంది అని ఓ టాక్ బలంగా వినిపిస్తోంది. మరి బాలయ్య చేస్తాడా ? లేదా ? అనేది హక్కు చూడాలి.

    Also Read:  ఈ రాశి వారికి నమ్మించి వెన్నుపోటు పొడిచే లక్షణాలు ఎక్కువ… అందులో మీ రాశి కూడా ఉందేమో చూడండి!

    Tags