https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు రాజమౌళితో చేసే సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ని పెట్టి సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 11, 2024 / 03:13 PM IST

    Do you know how much remuneration Mahesh Babu is getting for his film with Rajamouli

    Follow us on

    Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక తండ్రిని మించిన తనయుడుగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ 3 హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి తో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటకి అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం లేదు.

    ఇక దాంతో రాజమౌళి ఎందుకిలా చేస్తున్నాడు అంటూ కొంతమంది ఆయన పైన ఫైర్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ని పెట్టి సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది ఎప్పుడు అవుతుంది అనే దాని మీదనే ఇంకా క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది.

    అది ఏంటి అంటే రాజమౌళితో చేయబోయే సినిమా కోసం మహేష్ బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు మూడు సంవత్సరాలు తన డేట్స్ ని కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి మూడు సినిమాలకు సరిపడ పారితోషకాన్ని ఈ ఒక్క సినిమాతోనే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. నిజానికైతే మహేష్ బాబు ఒక సినిమాకి ప్రస్తుతం 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

    కాబట్టి ఈ సినిమాకోసం దాదాపు 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి… ఇక ఈ సినిమాతో వరల్డ్ లోనే తన సత్తా చాటాలని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు…చూడాలి మరి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్ల కలెక్షన్లను వసూల్ చేస్తుందో..