Dalapathi: మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో చిరంజీవి మరియు రజినీకాంత్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తమిళ ఫిలిం ఇండస్ట్రీ లో రజినీకాంత్ నెంబర్ 1 హీరో అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి నెంబర్ 1 హీరో..ఇద్దరు ఇద్దరే..ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి..ఒక్కరు తన స్టైల్ తో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త ఒరవడిని సృష్టిస్తే..మరొక్కరు తమ అద్భుతమైన డాన్స్ మరియు ఫైట్స్ తో ఒక్కే మూసలో వెళ్తున్న తెలుగు సినిమా గతిని మార్చేశారు..ఇలా వీళ్లిద్దరి గురించి చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క ఆర్టికల్ సరిపోదు..కెరీర్ ప్రారంభం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో కాళీ మరియు బందిపోటు సింహం వంటి సినిమాలు వచ్చాయి..కానీ సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేదు..గ్యాంగ్ లీడర్ సినిమా సమయం లో తమిళ్ లో రజినీకాంత్ హీరో గా తెరకెక్కిన మాపిళ్ళై అనే సినిమా విడుదల అయ్యింది..ఈ మూవీ లో చిరంజీవి అతిధి పాత్రలో కనిపిస్తాడు అంతే..కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ సినిమా మాత్రం స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చెయ్యలేదు.

Also Read: NTR Blockbuster Movie Sequel: బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ లో ఎన్టీఆర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
అయితే అప్పట్లో మణిరత్నం రజినీకాంత్ మరియు మమ్ముటి వంటి సూపర్ స్టార్స్ ని పెట్టి దళపతి అనే సినిమా తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..అప్పట్లోనే మూడు కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ ఇండియాలోనే ఒక్క సెన్సషనల్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాని తొలుత మణిరత్నం గారు రజినీకాంత్ మరియు చిరంజీవి కాంబినేషన్ లో చేద్దాం అనుకున్నారు అట..దీనికోసం చిరంజీవి ని సంప్రదించారు కూడా..అయితే కథ రీత్యా ఈ సినిమాలో హీరో రజినీకాంత్..చిరంజీవి పాత్ర కేవలం ఒక్క శక్తివంతమైన ప్రధాన పాత్ర అంతే!..అప్పటికే చిరంజీవి తెలుగు లో తిరుగులేని స్టార్ హీరో గా నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు..అలాంటి సమయం లో ఇద్దరు హీరోలను సమానంగా చూపించే మల్టీస్టార్ర్ర్ తరహా సినిమా అయితే చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని..కానీ ఇలాంటి ప్రధాన పాత్రలు చెయ్యడం వల్ల తన అభిమానులు హర్ట్ అవుతారు అని, పైగా ఈ సినిమా తమిళ్ లో ఒక్కటే విడుదల అయితే పర్వాలేదు కానీ..తెలుగు లో కూడా విడుదల చెయ్యాలి అనుకుంటున్నారు కాబట్టి నేను ఈ సినిమా చెయ్యలేను దయచేసి క్షమించండి అంటూ చిరంజీవి చాలా సున్నితంగా తిరస్కరించాడు అట..అలా ఈ ఇద్దరి సూపర్ స్టార్స్ కాంబినేషన్ లో ఒక్క అద్భుతమైన మూవీ మిస్ అయ్యింది.

Also Read: Jai Andhra Movement: ‘జై ఆంధ్ర’ ఉద్యమం సక్సెస్సా, ఫెయిలా? ఉద్యమం లక్ష్యం ఏమిటి?
Recommended videos
[…] Also Read: Dalapathi: షాకింగ్.. దళపతి సినిమాని వదులుకున… […]
[…] Also Read:Dalapathi: షాకింగ్.. దళపతి సినిమాని వదులుకున… […]