Sanjay Bangar Son: స్టార్ క్రికెటర్ కొడుకు.. అమ్మాయిగా మారిపోయాడు.. సంచలనం రేకెత్తిస్తున్న వీడియో..

అతడు అబ్బాయిగా పుట్టాడు. తన తండ్రి క్రికెటర్ కావడంతో.. అతడి కూడా దానినే కెరియర్ గా ఎంచుకున్నాడు. ముందుగా గల్లీలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా రాటు తేలడం ప్రారంభించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 11, 2024 3:56 pm

Sanjay Bangar Son

Follow us on

Sanjay Bangar Son: తన కెరియర్ కు పటిష్టమైన పునాది పడుతున్న దశలోనే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అది ఆ స్టార్ క్రికెటర్ ఇంట్లో ప్రకంపనలు సృష్టించగా.. సోషల్ మీడియాలో సంచలనాలకు కారణమవుతోంది. టీమిండియా కు మొన్నటిదాకా బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ పనిచేశాడు. సంజయ్ కి ప్రస్తుతం 51 సంవత్సరాలు. ఇతడిది మహారాష్ట్ర. 2001 నుంచి 2004 వరకు టీమిండియా కు ఆడాడు. కుడి చేతివాటంతో ఇతడు బ్యాటింగ్ చేయగల నేర్పరి. భారత జట్టు తరుపున ఇప్పటివరకు 12 టెస్టులు ఆడాడు. 15 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 470, 180 రన్స్ చేశాడు. ఈ ఫార్మాట్లలో 7 వికెట్ల చొప్పున పడగొట్టాడు. సంజయ్ కశ్మీరా అనే ఆయనను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పేరు ఆర్యన్ బంగర్. క్రికెటర్ కంటే కోచ్ గానే సంజయ్ సుప్రసిద్ధుడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరించాడు. కొన్ని సందర్భాలలో హెడ్ కోచ్ గా పనిచేశాడు. సంజయ్ పెద్ద కుమారుడు ఆర్యన్ మొదట్లో బాగానే ఉండేవాడు. తండ్రి బాటలోనే క్రికెటర్ కావాలని భావించాడు. అయితే కొంతకాలంగా అతడు క్రికెట్ లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. తన శరీరంలో విభిన్నమైన మార్పులు చోటు చేసుకోవడంతో ఆర్యన్ కాస్త అనయ గా మార్పు చెందాడు. ఇది సంజయ్ కుటుంబ సభ్యులనే కాదు.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.. ఈ విషయాన్ని అతడు అధికారికంగా వెల్లడించాడు. పురుషుడి నుంచి స్త్రీగా తను మార్పు చెందడం వెనుక.. ఉన్న ప్రయాణాన్ని వివరించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా అతడు నెటిజన్లతో పంచుకున్నాడు.

నచ్చినట్టు మారిపోయాను

ఇన్ స్టా గ్రామ్ లో అతడు షేర్ చేసిన వీడియోలో సంచలన విషయాలు వెల్లడించాడు. ” నేను శారీరకంగా దృఢంగా ఉండేవాణ్ణి. కానీ కొంతకాలంగా బలాన్ని నష్టపోతున్నాను. ఇప్పుడు మాత్రం విపరీతమైన సంతోషాన్ని పొందుతున్నాను. ఆ శరీరం పూర్తిగా మరో రూపాన్ని దాల్చింది. నాలో మొదటి వరకు అసంతృప్తి ఉండేది. ఇప్పుడు అది పూర్తి సంతృప్తి దారి పడుతుంది. ఇప్పుడే ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ప్రతి అడుగు ఇకపై నేను విభిన్నంగా వేయాల్సి ఉంటుంది. దీనిని నేను ఆస్వాదిస్తున్నాను. మరింతగా సంతృప్తి చెందుతున్నానని” ఆర్యన్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఆర్యన్ గతంలో భారత దేశవలి క్రికెట్ ఆడాడు. అతడు ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో ఉంటున్నట్టు తెలుస్తోంది..ట్రాన్స్ జెండర్స్ కు క్రికెట్ ఆడే అవకాశం లేదు. అయితే తన అద్భుతమైన కలను నెరవేర్చుకునే అవకాశం లేదని ఆర్యన్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తం చేశాడు.ట్రాన్స్ జెండర్స్ కు క్రికెట్ ఆడే అవకాశం ఇవ్వాలని ఆర్యన్ కోరుతున్నాడు. ” నా ప్రేమ క్రికెట్ చుట్టూ ఉంది. నా ఆశయం క్రికెట్లో అత్యున్నత శిఖరాలు సాధించాలని ఉండేది. మా నాన్న గొప్ప క్రికెటర్. దేశానికి సేవలందించాడు. బెంగళూరు జట్టుకు తన అనుభవాన్ని ఆపాదించాడు. అతడిని చూస్తూ నేను పెరిగాను. గొప్ప క్రికెటర్ కావాలని భావించాను. మధ్యలో ఇలా అవుతుందని ఊహించలేదు. క్రికెట్ కు దూరం కావలసి వస్తుందని అంచనా వేయలేదు. నా శరీరం గతంలో లాగా లేదు. నా కండరాల బలం పూర్తిగా తగ్గిపోయింది. అందువల్లే అనయగా మారిపోయానని” ఆర్యన్ పేర్కొన్నాడు..కాగా, ట్రాన్స్ జెండర్లకు క్రికెట్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. గత ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. మహిళల క్రికెట్ ను కాపాడేందుకు.. దానికి అభ్యున్నతిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసిసి పేర్కొంది.