Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం విడుదలై నాలుగు వారాలు పూర్తి అయ్యింది. ఈ నాలుగు వారాల్లో ఎన్నో కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలయ్యాయి. కానీ ఆడియన్స్ మాత్రం ఇంకా పుష్ప మేనియా నుండి బయటకి రాలేకపోతున్నారు. ఇప్పటికీ వాళ్లకు ఈ సినిమానే మొదటి ఛాయస్ గా మిగిలింది. మధ్యలో UI , మ్యాక్స్, మార్కో వంటి సూపర్ హిట్ చిత్రాలు విడుదలైనప్పటికీ ‘పుష్ప 2’ మేనియా ని బీట్ చేయలేకపోయాయి. నిన్న కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది మామూలు విషయం కాదు. సాధారణంగా ఈపాటికి ఏ స్టార్ హీరో సినిమా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ని ముగించుకొని ఓటీటీ లో అందుబాటులో ఉండేది. కానీ ‘పుష్ప 2’ ఊపు చూస్తుంటే మరో రెండు వారాలు సాలిడ్ థియేట్రికల్ రన్ వచ్చేలా ఉంది.
నిన్న కూడా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చింది. మొత్తం మీద నాలుగు వారాలకు 812 కోట్ల రూపాయిల షేర్, 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. తమిళనాడు, కేరళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రన్ ముగిసి చాలా రోజులైంది. కేరళ లో డిజాస్టర్ గా నిల్చింది. తమిళనాడు లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు. కానీ కర్ణాటక లో మాత్రం ప్రభంజనం సృష్టించింది. కన్నడ సినిమాలు కూడా అక్కడ వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోవడం చాలా కష్టం. కేజీఎఫ్, కాంతారా, విక్రమ్ రోనా, రాజకుమారా, మరియు జేమ్స్ వంటి కన్నడ చిత్రాలు వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నాయి.
అలా చాలా కన్నడ సినిమాలకే అంత కష్టమైన వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ ని పుష్ప 2 పది రోజుల్లోనే అందుకొని, ఇప్పుడు 130 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదంతా పక్కన పెడితే నాల్గవ వారం లో ఈ చిత్రానికి 13 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోయాయట. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి రెండవ వారం లో కూడా ఈ రేంజ్ టిక్కెట్లు సేల్ అవ్వలేదని, అలాంటిది పుష్ప 2 నాల్గవ వారం లో ఈ స్థాయిలో ఉండడం సాధారణమైన విషయం కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు. బాహుబలి 2 చిత్రానికి ఫుల్ రన్ లో 10 కోట్లకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. పుష్ప 2 చిత్రానికి ఇప్పటి వరకు 6 కోట్ల టికెట్స్ సేల్ అయ్యాయి. బాహుబలి 2 రికార్డుని కొట్టడం కష్టమే కానీ, ఫుల్ రన్ లో మరో పది లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాలు ఉన్నాయి.