Sudheer : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ ఎంతటి పాపులారిటీ ని క్రేజ్ ని సంపాదించుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా మంది మీడియం రేంజ్ హీరోలకు కూడా లేదు. కేవలం ఈయన కోసమే అప్పట్లో లక్షల సంఖ్యలో ఆడియన్స్ జబర్దస్త్ షోని చూసేవారు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు, ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిటికి సుడిగాలి సుధీర్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉండేవాడు. కానీ ఆయనకి సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రావడం వల్ల ఈటీవీ ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు ఆయన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో కి యాంకర్ గా వ్యవహరించేవాడు కానీ, ఆ తర్వాత ఆ షో కూడా మానేసి ఈటీవీ కి పూర్తిగా దూరమయ్యాడు. చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇదంతా పక్కన పెడితే సుధీర్ కి ఈటీవీ లో తనతో కలిసి పని చేసిన వాళ్ళతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్,సన్నీ లాంటోళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కి ముందు నుండే వీళ్ళు మంచి స్నేహితులు. కానీ సుధీర్ కి ఇండస్ట్రీ లో ఉన్నటువంటి శేఖర్ మాస్టర్, రోజా, నాగబాబు, ఇంద్రజ వంటి వారితో కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. రీసెంట్ గా ఇంద్రజ సుధీర్ ని తల్చుకుంటూ, చాలా మిస్ అవుతున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘జబర్దస్త్ లో నేను సుధీర్ ని బాగా మిస్ అవుతున్నాను. ఒకసారి సుధీర్ ని అనుకరిస్తూ కెవ్వు కార్తీక్ ఒక స్కిట్ వేసాడు. ఆ స్కిట్ లో అతను అచ్చు గుద్దినట్టు సుధీర్ లాగా నటించాడు’ అంటూ చెప్పుకోచింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘సుధీర్ లాగా మాట్లాడడం, సుధీర్ లాగా స్టైల్ అద్దాలు తీసి పెట్టుకోవడం వంటివి కార్తీక్ ఇమిటేట్ చేసేలోపు నాకు సుధీర్ గుర్తొచ్చి కన్నీళ్లు ఆగలేదు. అతను నన్ను ఎంతో గౌరవించే వాడు. తను నన్ను ప్రేమతో అమ్మా అని పిలిచేవాడు. అలా పిలిపించుకోవడం లో నాకు ఎంతో ఆనడం దొరికింది. అప్పుడప్పుడు నన్ను రాజీ అని కూడా పిలిచేవాడు. అలా నన్ను మా ఇంట్లో వాళ్ళు తప్ప ఇప్పటి వరకు ఎవ్వరూ పిలవలేదు. సుధీర్ తో నాకు చాలా ఎమోషనల్ బాండ్’ ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఇంద్రజ. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం సుధీర్ హీరో గా బాగా బిజీ అయిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.