https://oktelugu.com/

Prabhas-Pawan Kalyan: ప్రభాస్ పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా కోసం చాలా మంది ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారా..?

పవన్ కళ్యాణ్ ప్రభాస్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఒక సినిమా ఫంక్షన్ లో ప్రభాస్ కూడా 'ఐ లవ్ పవన్ కళ్యాణ్' అని చెప్పడం...

Written By:
  • Gopi
  • , Updated On : March 19, 2024 / 11:58 AM IST

    Prabhas Pawan Kalyan combo

    Follow us on

    Prabhas-Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న హీరో ప్రభాస్...ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్నాడు ఆయన గత సంవత్సరం రెండు సినిమాలను రిలీజ్ చేయగా, అందులో ఆది పురుష్ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయిన కూడా సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమా తో ఏకంగా 800 కోట్ల కలెక్షన్లు తన ఖాతాలో వేసుకున్నాడు…ఇక ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల నుంచి ప్రభాస్ కు పవన్ కళ్యాణ్ కి మధ్య చాలా మంచి సన్నిహిత్యం ఉందనే విషయం మనందరికీ తెలిసిందే…

    ఇక రీసెంట్ గా కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ ప్రభాస్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఒక సినిమా ఫంక్షన్ లో ప్రభాస్ కూడా ‘ఐ లవ్ పవన్ కళ్యాణ్’ అని చెప్పడం అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులని ఖుషి చేసింది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కు పవన్ కళ్యాణ్ లో ఆ ఒక్క విషయం అంటే చాలా ఇష్టమట.. అదేంటి అంటే ఆయన దేని గురించైనా సరే చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉంటాడు. దానివల్లే పవన్ కళ్యాణ్ లో ఉన్న గొప్పతనం చాలా బాగా ఎలివేట్ అవుతుంది అంటూ ప్రభాస్ ఇంతకుముందు కొన్నిసార్లు కామెంట్లు అయితే చేశాడు. ఇక వీళ్లిద్దరూ కూడా వైజాగ్ సత్యనంద్ గారి దగ్గర యాక్టింగ్ లో శిక్షణ తీసుకోవడం అనేది నిజంగా మంచి విషయమనే చెప్పాలి.

    అయితే ముందుగా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ శిక్షణ తీసుకున్న తర్వాత ప్రభాస్ తీసుకున్నాడు. ఇద్దరు వేర్వేరు బ్యాచుల్లో శిక్షణ తీసుకున్నారు. ఇక మొత్తానికైతే ఇద్దరు ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతుండటం విశేషం… ఇక వీళ్లిద్దరూ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ గా ఉన్నారు. ఒక మంచి కథ దొరికితే పక్కగా చేస్తారు అనే విషయం అయితే తెలుస్తుంది…ఇక వీళ్ల కోసమే కొంత మంది ప్రొడ్యూసర్లు కథలు కూడా రెఢీ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక పవన్ కళ్యాణ్ ఓజి సినిమాతో పాన్ ఇండియాలో తన స్టామినా ను చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ కూడా ఇప్పటికీ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు…