Love and War Movie: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ సినిమా సెట్స్ లో జరిగిన భారీ ప్రమాదం వల్ల ఒక కార్మికుడు చనిపోయాడు. ఇక దాంతో ఫెడరేషన్ సంస్థల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. సినీ కార్మికుల పని గంటలను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒక కాల్ షీట్ మీద 12 గంటల పని మాత్రమే ఉండాలని అలా కాకుండా 18 నుంచి 20 గంటల పాటు తమ చేత పనిచేయుచుకుంటున్నారని దీని వల్ల వాళ్లు శారీకంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా సరిగ్గా ఉండటం లేదని బాలీవుడ్ కార్మిక సమాఖ్య (FWICE) ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికుల పనిగంటలను కూడా తగ్గించాలనే కొన్ని డిమాండ్లైతే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సినీ కార్మికులు 12 గంటలకు మించి ఓవర్ టైం పని చేసినట్లయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్లకు అదనపు డబ్బులను అందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు…
అలాగే వర్క్ చేసే ప్రతి సినీ కార్మికుడి గ్రూప్ కి ఒక ఇన్సూరెన్స్ ఉండాలని వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వాళ్లకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు… మొత్తానికైతే సంజయ్ లీలా బన్సాలీ సెట్లో చనిపోయిన చంద్రధారి సింగ్ యాదవ్ కుటుంబానికి ప్రొడక్షన్ హౌజ్ 40 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించడానికి సిద్ధమైంది.
ఇక దీని మీద FWICE ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబం మొత్తానికి ఒక్కడే జీవనాధారంగా ఉన్నాడు. తనకు 42 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 40 లక్షలు చెల్లిస్తే ఆ కుటుంబం ఎలా బతుకుతుంది. మినిమం 50 లక్షలు అయిన చెల్లించాలి అంటూ బన్సాలీ ప్రొడక్షన్ హౌస్ ను డిమాండ్ చేస్తున్నారు…ఇక దీంతో ఎన్డీయేలో ఉన్న అన్ని ఇండస్ట్రీలోని సినీ కార్మికులకు భద్రతను ఏర్పరచాలనే డిమాండ్ చేస్తున్నారు…
