Bigg Boss Emmanuel: గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎంటెర్టైనెర్స్ గా మంచి పేరు తెచ్చుకున్న అవినాష్, రోహిణి మరియు టేస్టీ తేజ చాలా ఎమోషనల్ అవుతూ ఒక మాట అంటారు. ఎంటర్టైనర్స్ ని ఆడియన్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తారు, కానీ విన్నర్ ని చెయ్యరు అని అవినాష్ ఒక సందర్భంలో రోహిణి, టేస్టీ తేజ తో అంటాడు. కానీ ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఒక కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇమ్మానుయేల్ కేవలం టైటిల్ విన్నింగ్ ని దృష్టిలో పెట్టుకొనే గేమ్ ఆడాడు. అందుకు తగ్గట్టుగా స్ట్రాటజీలు వేసి సక్సెస్ కూడా అయ్యాడు. ఒక పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే , మరోపక్క టాస్కులు అద్భుతంగా ఆడుతూ తనకు పోటీ ఎవ్వరూ లేరు అని అనిపించుకున్నాడు. ఆల్ రౌండర్ , మిస్టర్ 360 వంటి పేర్లు కూడా అతనికి వచ్చాయి.
బయట నుండి వచ్చిన అతిధులు కూడా టైటిల్ విన్నింగ్ రేస్ కేవలం తనూజ, ఇమ్మానుయేల్ మధ్య మాత్రమే ఉంటుంది అన్నట్టుగా హింట్స్ ఇచ్చారు. కనీసం టైటిల్ గెలవకపోయినా, రన్నర్ రేంజ్ కి వెళ్లినా చాలని అనుకున్నారు ఇమ్మానుయేల్ ఫ్యాన్స్. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా టాప్ 4 స్థానం లో ఎలిమినేట్ అవ్వడం అందరినీ చాలా బాధపెట్టింది. అసలు ఆడియన్స్ బిగ్ బాస్ షో ని చూస్తున్నారా?, తనకంటే గేమ్స్ లో తక్కువ ఆడే పవన్ కళ్యాణ్ ని ఏకంగా టైటిల్ విన్నర్ ని చేశారు, టైటిల్ విన్నింగ్ కి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఇమ్మానుయేల్ ని మాత్రం కనీసం టాప్ 3 వరకు కూడా తీసుకొని రాలేదు. దీన్ని బట్టీ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ని అసలు ఆడియన్స్ చూసే ఓట్లు వేస్తున్నారా?, కష్టపడే వాళ్లకు గుర్తింపు లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిన్న ఇమ్మానుయేల్ ని ఆ స్థానం లో చూడగానే అతని తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో మనమంతా చూసాము. ఇమ్మానుయేల్ కూడా ఒక్క క్షణం అలా బాధపడ్డాడు కానీ, వెళ్లే ముందు టాప్ 3 కంటెస్టెంట్స్ తో మీ ముగ్గురిలో ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే వంటి మంచి మాటలు చెప్పి బయటకి వస్తాడు ఇమ్మానుయేల్. ఇంత మంచోడిని గెలిపించుకోలేకపోయామే అని ఆడియన్స్ కనీసం అప్పుడైనా ఫీల్ అయ్యుండొచ్చు. దీనిని బట్టీ చూస్తే రాబోయే సీజన్స్ లో కమెడియన్స్ ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారా? లేదా అనే సందేహం కలగడం లో ఎలాంటి తప్పు లేదు. హౌస్ కి వచ్చి అంత కష్టపడి గేమ్ ఆడుతూ చివరికి టాప్ 5 రేంజ్ లో ఎలిమినేట్ అవ్వడానికి బిగ్ బాస్ దాకా రావడం ఎందుకు అనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవ్వొచ్చు. చూడాలి మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది.