AR Rahman , Ram Charan ,Buchi Babu
AR Rahman and Ram Charan : గేమ్ చేంజర్’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు తో ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఈ నెల 27 నుండి మూడవ షెడ్యూల్ ని మొదలు పెట్టుకోనుంది. హైదరాబాద్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొననున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ స్టోరీ ని అందించాడు. ఇందులో రామ్ చరణ్ వివిధ ఆటల్లో ప్రావీణ్యం ఉన్న గొప్ప క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. ఆయనకు గురువు గా ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
అయితే సోషల్ మీడియా లో గత రెండు రోజులు నుండి ఒక పుకారు తెగ షికారు చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం నుండి ఆయన తప్పుకున్నాడని, ఆయన స్థానంలోకి దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్ వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందడంతో మూవీ టీం కి సంబంధించిన వారు వెంటనే స్పందించారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఈ చిత్రానికి AR రెహ్మాన్ మాత్రమే మ్యూజిక్ అందిస్తున్నారని ఖరారు చేసారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో రామ్ చరణ్ అంటే పడని వారు ఇలాంటి రూమర్స్ ని పుట్టిస్తున్నారట.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం నా కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలుస్తుందని రామ్ చరణ్ ఇది వరకే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. నా కెరీర్ లో రంగస్థలం చిత్రం ఎంతో ప్రత్యేకం. సినిమా కంటెంట్ పరంగా, అలాగే నటుడిగా ఆ చిత్రం నన్ను ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది. నేను త్వరలో బుచ్చిబాబు తో చేయబోయే సినిమా అంతకు మించిన చిత్రమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ప్రతీ సినిమాని ఈమధ్య ప్రేక్షకులు రంగస్థలం చిత్రంతో పోల్చి చూస్తున్నారు. రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాని కూడా అలా పోల్చి చూస్తే ప్రమాదమని అభిమానులు భయపడుతున్నారు. డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుండి రాబోతున్న సినిమా ఇది. బాక్స్ ఆఫీస్ వద్ద మోతెక్కిపోయే బ్లాక్ బస్టర్ అవ్వాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. మరి ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని రామ్ చరణ్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.