Sankranti Akumanam
Sankranti Akumanam : ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి విజేతగా నిల్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. వాస్తవానికి సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో కనీవినీ ఎరుగని ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఆ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని, క్లోజింగ్ కలెక్షన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయని అనుకున్నారు. కానీ ఆ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో, అందరి ద్రుష్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంపై వెళ్ళింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. సీనియర్ హీరో అయినటువంటి విక్టరీ వెంకటేష్ కి ఆడియన్స్ నేటి తరం స్టార్ హీరోలకు ఎలాంటి వసూళ్లు ఇస్తారో, అలాంటి వసూళ్లను అందించారు. మూవీ టీం కచ్చితంగా ఈ చిత్రం భారీ హిట్ అవుతుందని అనుకున్నారు కానీ, ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు.
ఈ చిత్రం విడుదలై అప్పుడే 10 రోజులు పూర్తి చేసుకుంది. ఈ పది రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది?, ఫుల్ రన్ లో ఇంకా ఎంత వసూళ్లను రాబట్టబోతుంది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 170 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఇంత వసూళ్లు రావడం సాధారణమైన విషయం కాదు. షేర్ వసూళ్లు దాదాపుగా 105 కోట్ల రూపాయిలు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఉంటుందని అంటున్నారు. 10వ రోజు దాదాపుగా 2 కోట్ల 81 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందట. 9 వ రోజు తో పోలిస్తే కేవలం 10 శాతం మాత్రమే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. మామూలు వర్కింగ్ డేస్ లో పుష్ప 2 తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికే భారీ వసూళ్లు వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 6 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ లో 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 10 రోజులకు గాను 125 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రేపు, ఎల్లుండి, మర్నాడు సెలవులు కావడంతో భారీ వసూళ్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు రోజులతో ఈ చిత్రం కచ్చితంగా 150 కోట్ల రూపాయిల మార్కుని దాటుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. వచ్చే వారంతో ‘అలా వైకుంఠపురంలో’ ఫుల్ రన్ వసూళ్లను అధిగమిస్తుందని, ఫుల్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది.