
Manchu Manoj : మంచు మనోజ్ ఈమధ్యనే దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.పరిమితమైన మిత్రులు సన్నిహితుల మధ్య ఈ పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకున్నాడు, మంచు లక్ష్మి వీళ్లిద్దరి పెళ్లిని దగ్గరుండి మరీ తన సొంత ఖర్చులతో తన ఇంట్లోనే జరిపించింది.2016 వ సంవత్సరం లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడిన మనోజ్, కొన్ని విబేధాల కారణంగా 2019 వ సంవత్సరం లో విడిపోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత భూమా మౌనిక తో ప్రేమలోపడ్డ మనోజ్ గత కొంతకాలం గా డేటింగ్ చేస్తూ రీసెంట్ గానే పెళ్లి చేసేసుకున్నాడు.అయితే భూమా మౌనిక కి కూడా ఇది మొదటి పెళ్లి కాదు, రెండవ పెళ్లి.గతం లో ఆమె గణేష్ రెడ్డి అనే ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లాడింది.వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, కొంతకాలం సాఫీగానే సాగిన వీళ్ళ వైవాహిక బంధం కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది.
గతం లో మౌనిక పెళ్ళికి మంచు మనోజ్ కూడా ముఖ్య అతిధిగా హాజరై ఉండడం విశేషం.ఇదంతా పక్కన పెడితే మనోజ్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, ఆయన మనసు ఎంత మంచిదో అర్థం అయ్యేలా చేస్తుంది.భూమా మౌనిక – గణేష్ లకు పుట్టిన బిడ్డని తన సొంత కొడుకుగా స్వీకరించి, అతని అన్నీ నేనే అని మాట ఇచ్చి పెళ్లి చేసుకోవడాన్ని అందరూ ఎంతగానో మెచ్చుకుంటున్నారు.సాధారణంగా ఎవ్వరూ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి మనసు రాదు.
నాకంటూ ప్రత్యేకంగా బిడ్డ ఉండాలి, నా ఆస్తులకు వారసుడు అవ్వాలి అని అనుకుంటారు.కానీ మనోజ్ ఇక్కడ మౌనిక బిడ్డని స్వీకరించి తన సొంత కొడుక్కి దక్కాల్సిన అన్నీ గౌరవాలను అందిస్తున్నదంటే ఆయన మనసు ఎంత గొప్పదో అర్థం అవుతుంది.సాధారణంగానే మనోజ్ కి సోషల్ మీడియా లో మంచి సపోర్టు ఉంటుంది,ఈ గొప్ప పనితో ఆయన మరింత పాజిటివిటీ ని మూటగట్టుకున్నాడు.