https://oktelugu.com/

Samarasimha Reddy: బాలకృష్ణ చేసిన సమర సింహ రెడ్డి సినిమాను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?

బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం అయితే ఉంటుంది. ఇక ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలకు సాధ్యం కానీ రీతిలో బాలయ్య అప్పట్లోనే ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి ప్రయోగాత్మక మైన సినిమాలను చేశాడు..

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 09:36 AM IST

    Samarasimha Reddy

    Follow us on

    Samarasimha Reddy: నందమూరి బాలకృష్ణ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘సమర సింహారెడ్డి ‘ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తో బాలయ్య బాబు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. నిజానికి అంతకుముందు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలి అంటే ప్రతి ఒక్కరు భయపడేవారు. కానీ బాలయ్య బాబు మాత్రం డేరింగ్ స్టెప్ వేసి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక భారీ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని అందుకొని మరి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసి చూపించాడు. నిజానికి సమర సింహారెడ్డి లాంటి ఒక హై వోల్టే సినిమాని చేయాలంటే మిగతా హీరోల వల్ల అయ్యేది కాదు. అది కేవలం బాలయ్య బాబుకు మాత్రమే సాధ్యమైంది.

    ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఆ సినిమా కథని రజినీకాంత్ చేసిన ‘భాషా ‘ సినిమా ఇన్స్పిరేషన్ తో రాసుకున్నట్టుగా తెలియజేశాడు. నిజానికి భాషా సినిమా నుంచే ఒక హీరోకి ఎలివేషన్స్ గాని, మోషన్స్ ని గాని ఆడ్ చేస్తూ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తో స్క్రీన్ ప్లే ని ఆడ్ చేసి స్టోరీగా రాసే కథలు మొదలయ్యాయి. దాని వల్లే భాషా ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక భాషా ఇన్స్పిరేషన్ తో రాసుకున్న సమర సింహా రెడ్డి సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి పెను ప్రభంజనాన్ని సృష్టించింది.

    ఇక రీసెంట్ గా బాలయ్య బాబు 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ తను ‘ఇంద్ర ‘ సినిమా చేయడానికి బాలయ్య బాబు సమర సింహారెడ్డిని సినిమానే ఇన్స్పిరేషన్ గా నిలిచిందని దానివల్లే తను కూడా అలాంటి ఒక సినిమా చేసి సక్సెస్ సాధించాలని అనుకున్నాడని చిరంజీవి చెప్పడం విశేషం… ఇక మొత్తానికైతే బాలయ్య బాబు రజినీకాంత్ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే బాలయ్య బాబు ను చిరంజీవి ఇన్స్పిరేషన్ గా తీసుకోని సినిమాలు చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    ఏది ఏమైనప్పటికీ బాలయ్య బాబు, చిరంజీవి సీనియర్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకుంటూనే భారీ సక్సెస్ లను అందుకోవడానికి ఇప్పటికి కూడా విపరీతంగా కష్టపడుతున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇప్పుడు ప్రేక్షకులను అలరించడమే భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.