Shubham : హీరోయిన్ గా 15 ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో అగ్రస్థాయిలో కొనసాగుతూ తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న సమంత(Samantha Ruth Prabhu), కొంతకాలం విరామం ఇచ్చి నిర్మాతగా మారి నిర్మించిన ‘శుభమ్'(Subham Movie) చిత్రం రీసెంట్ గానే ఎలాంటి హడావుడి లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ గా నిలిచి సమంత కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సమంత తల్చుకుంటే పెద్ద యాక్టర్స్ ని పెట్టి ఈ సినిమా చేసి భారీ లాభాలను అర్జించడానికి సేఫ్ గేమ్ ఆడి ఉండొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు, కొత్త వాళ్ళను ఎంచుకొని, వాళ్ళని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫలితం ఆమె ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చింది. థియేటర్స్ నుండి దాదాపుగా మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీ లోకి అందుబాటులోకి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని జీ5 సంస్థ 5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకునేలా ఒప్పందం కుదిరించుకుంది సమంత. అంటే కచ్చితంగా ఈ చిత్రం జూన్ 10 లోపు కానీ, ఆ తర్వాత కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కేవలం తెలుగు వెర్షన్ లోనే ఈ సినిమా అందుబాటులోకి వస్తుందా?, లేకపోతే ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుందా అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా విడుదలైన నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే జీ5 లో విడుదలైంది. ‘శుభమ్’ చిత్రాన్ని కేవలం 5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు కాబట్టి, కేవలం ఒక్క భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవ్వొచ్చు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి.
Also Read: అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో ఎక్కువ భాగం అండర్ వాటర్ లోనే ఉంటుందా..?
ఈ సినిమాతో సమంత ఓవర్సీస్ లో ఎంత స్ట్రాంగ్ అనేది కూడా మార్కెట్ కి తెలిసొచ్చింది. సాధారణంగా ఓవర్సీస్ లో హీరోలకే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి చూపించరు. అలాంటిది ఊరు పేరు తెలియని వాళ్ళ సినిమా ఓవర్సీస్ లో భారీ లాభాలను రాబట్టడం అంటే కచ్చితంగా సమంత అనే బ్రాండ్ ఇమేజ్ కారణంగానే అని సోషల్ మీడియా లో ఆమె అభిమానులు అంటున్నారు. కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి 2 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ నెంబర్ కంటే లక్ష డాలర్ల గ్రాస్ ఏకువ వచ్చింది అన్నమాట. దీనిని బట్టీ కొంతమంది మీడియం రేంజ్ హీరోల సినిమాలకంటే సమంత బ్రాండ్ ఎంతో పవర్ ఫుల్ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.c