గాన గంధర్వుడి అభిమానులకు శుభవార్త !

సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకు గురైంది. ఇప్పుడిపుడే ఆ బాధ నుండి బయట పడుతూ, బాలుగారి పాటలతో ఊరట పొందుతూ ఆయన లేని లోటును తీర్చుకుంటున్న అభిమానులకు ఓ శుభవార్త. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చి.. బాలుగారి అభిమానులను ఆకట్టుకుంది. నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్ కు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును […]

Written By: admin, Updated On : November 27, 2020 4:33 pm
Follow us on


సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకు గురైంది. ఇప్పుడిపుడే ఆ బాధ నుండి బయట పడుతూ, బాలుగారి పాటలతో ఊరట పొందుతూ ఆయన లేని లోటును తీర్చుకుంటున్న అభిమానులకు ఓ శుభవార్త. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చి.. బాలుగారి అభిమానులను ఆకట్టుకుంది. నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్ కు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టి.. సీఎం జగన్ బాలుగారికి నిజమైన నివాళ్లు అర్పించారు. అయితే దీనిపై బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: బిగ్ బాస్-4: దెయ్యంగా మారిన జలజ.. ఎవరో తెలుసా?

చరణ్ మాటల్లో.. ‘తన తండ్రికి గొప్ప గౌరవం దక్కిందని.. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి ఆయన ట్విట్టర్ ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సంగీత, నృత్య పాఠశాల పేరు ఇక నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుగా ఉంటుందని, దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం, పైగా దీనికి సంబంధించి ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ కూడా చేసి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఎస్పీ బాలుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని.. దీని పై బాలు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘మెగా’ అప్డేట్.. ఫ్యాన్స్ ఖుషీ..!

కాగా ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూనే బాలుగారి ఆనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ప్రముఖుల సైతం తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నా.. సోషల్ మీడియాలో సైతం గెట్ వెల్ సూన్ ఎస్పీ బాలు అనే హ్యాష్‌ట్యాగ్ తో లక్షలాది అభిమానులు వేడుకున్నా ఆ దేవుడు సంగీతానికి అన్యాయం చేసి ఆయనను తీసుకువెళ్లిపోయాడు. కోట్లాది గొంతుకుల చప్పుడుకైనా ఆయన ఇక లేకపోయినా ఆయన పాటలు ఎప్పటికీ ఉంటాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్