Homeఎంటర్టైన్మెంట్డేంజర్ జోన్ లో అఖిల్.. రికార్డ్ స్థాయిలో మోనాల్ !

డేంజర్ జోన్ లో అఖిల్.. రికార్డ్ స్థాయిలో మోనాల్ !

Akhil Elinated
బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ టైటిల్ కోసం చివర్లో ఐదుగురు పోటీలో ఉండాలి కాబట్టి.. ఒక్కొక్కరు హౌస్ లో నుండి ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ వీకెండ్ ఒకరు, మరో వీకెండ్ తర్వాత ఇంకొకరు ఎలిమినేట్ అవ్వాలి. అప్పుడు ఇక హౌస్ లో ఐదుగురు మాత్రమే మిగులుతారు. అయితే ముందుగా హౌస్ నుండి బయటకు వచ్చే వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. కాగా ఈ వీకెండ్ అఖిల్ డేంజర్ జోన్లో పడ్డాడు. అఖిల్ తో పాటు జబర్దస్త్ అవినాష్ కూడా ఓటింగ్ లో వెనుకబడ్డట్లు గూగుల్ ట్రెండ్స్ చూపుతున్నాయి.

Also Read: బిగ్ బాస్-4: దెయ్యంగా మారిన జలజ.. ఎవరో తెలుసా?

అయితే అఖిల్ కంటే అవినాష్ కాస్త బెటర్ పొజిషన్ లో ఉన్నాడట. కాబాట్టి ఎక్కువ డేంజర్ అఖిల్ కే ఉంది. మరి ఈ వీకెండ్ అఖిల్ ఇంటి పయనం పడుతాడా? లేదా ? అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు. చివరి నిమిషంలో పుంజుకొని నిలబడి టైటిల్ గెలుచుకున్న సందర్భాలు కూడా చాల ఉన్నాయి. అలాగే అఖిల్ కూడా సేవ్ అవుతాడేమో చూడాలి.

Also Read: బాలీవుడ్ ‘ఛత్రపతి’గా ఆ హీరో రాణిస్తాడా?

ఇక శుక్రవారం రాత్రి వరకు వోటింగ్ ఉంటుంది. ఇక మోనాల్ టాప్ 5 లో వెళ్లే అవకాశం కనిపిస్తోంది కాబట్టి.. హౌస్ లో లవ్ ట్రాక్స్ కి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. పైగా ఇప్పటికే మోనాల్ మొత్తం వరుసగా నాలుగు వారాలు ఎలిమినేషన్ ప్రమాదం నుంచి తప్పించుకొంది. ఇది కూడా బిగ్ బాస్ హౌస్ లో రికార్డే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version