‘వకీల్ సాబ్’కు ఏపీ ప్రభుత్వం మరో షాక్..

ఏపీలో పవన కల్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బెనిఫిట్ షో లను రద్దు చేసిన ప్రభుత్వంత తాజాగా ఈ సినిమాకు మరో షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేయనుంది. దీంతో బీజేపీ, జనసేన నాయకులు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టికెట్ రేట్లపై సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందోనన్న చర్చ సాగుతోంది. ఈనెల 9న విడుదలయిన […]

Written By: NARESH, Updated On : April 10, 2021 3:54 pm
Follow us on

ఏపీలో పవన కల్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బెనిఫిట్ షో లను రద్దు చేసిన ప్రభుత్వంత తాజాగా ఈ సినిమాకు మరో షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేయనుంది. దీంతో బీజేపీ, జనసేన నాయకులు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టికెట్ రేట్లపై సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందోనన్న చర్చ సాగుతోంది.

ఈనెల 9న విడుదలయిన ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లను రద్దు చేసింది. దీంతో ఫ్యాన్స్ కొపోద్రిక్తులై ఆందోళన నిర్వహించారు. అయితే టికెట్స్ రేట్స్ పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో సింగిల్ బెంచ్ జడ్జి వారికి అనుకూలంగా తీర్పునిచ్చాడు. దీంతో హర్షం వ్యక్తి చేసిన వారికి ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయనుంది. ఈ నిర్ణయంతో జనసేన, బీజేపీ-ప్రభుత్వం మధ్య రగడ తీవ్రమవుతోంది.

ఇదిలా ఉండగా వైసీపీ నాయకులు, బీజేపీ-జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ పై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. వీటిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. దీంతో ఆయన బీజేపీ నాయకుడు సునీల్ ధియోధర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీకు మోజు ఉందని తెల్లవారుజామునే 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు’ అని అన్నారు. స్పెషల్ షో కు పర్మిషన్ ఇవ్వలేదని సునీల్ గగ్గోలు పెడుతున్నారని, అసలు ఆ షో కు రేటు ఎంతో తెలుసా..? అని ప్రశ్నించారు. వకీల్ సాబ్ చిత్రానికి, ఎన్నికలకు ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు.