Homeఆంధ్రప్రదేశ్‌AP Theatre Issue: ఏపీలో సీజ్ చేసిన సినిమా థియేటర్లు తెరుస్తున్న ప్రభుత్వం.. దీనివెనుక పీపుల్స్...

AP Theatre Issue: ఏపీలో సీజ్ చేసిన సినిమా థియేటర్లు తెరుస్తున్న ప్రభుత్వం.. దీనివెనుక పీపుల్స్ స్టార్

AP Theatre Issue:  ఆంధప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నష్టం జరుగుతున్నదని పలువురు సినీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు. థియేటర్లలో టికెట్ల ధర విషయమై జగన్ సర్కారు జోక్యం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం చర్యలతో పలు థియేటర్స్ క్లోజ్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై ఇటీవల ప్రముఖ నటుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మాట్లాడారు.

AP Theatre Issue
AP Theatre Issue

తాజాగా నారాయణమూర్తి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. అనంతరం సీజ్ చేయబడిన థియేటర్స్ ఓపెన్ చేసుకునే అవకాశమిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దాంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం దృష్టికి సినిమా థియేటర్స్ ఓనర్స్ కష్టాలు, ఇబ్బందులు తీసుకెళ్లడంలో ఆర్.నారాయణమూర్తి ముందున్నారని పలువురు అంటున్నారు. అయితే, నిబంధనలు పాటించకపోవడం వల్లే థియేటర్స్‌ను సీజ్ చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Also Read:  చిరంజీవి సీఎం కల.. అసలు ఎలా పుట్టింది?

ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు సీజ్ చేసిన థియేటర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకునేందుకుగాను ఏపీ సర్కారు పర్మిషన్ ఇచ్చినట్లు వివరించారు. ఈ క్రమంలోనే థియేటర్స్ ఓనర్స్‌కు ప్రభుత్వం అందజేసే లైసెన్సులు, ఇతర సర్టిఫికెట్స్ రెన్యువల్స్‌కు గడువు ఇస్తున్నట్లు చెప్పారు మంత్రి నాని. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఏపీలో 130 టాకీసులను సీజ్ చేసినట్లు మంత్రి పేర్ని నాని వివరించారు.

లైసెన్స్ లేని థియేటర్స్ ఓనర్స్ లైసెన్స్ కోసం అప్లికేషన్ చేసుకోవాలని, వారికి అవకాశమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీ సర్కారు  జారీ చేసిన జీవో నెం.35ను అమలు ప్రకారం.. సినిమాటోగ్రఫీ చట్టంలో పేర్కొన్న విధంగా ఫైర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎన్ఓసీ తీసుకోని వాటిని రెవెన్యూ అధికారులకు సమర్పించి బీ ఫారమ్ లైసెన్స్ తీసుకోవాల్సని థియేటర్స్ ఓనర్స్‌కు మంత్రి సూచించారు. ఈ లైసెన్స్‌లను ప్రతీ ఏడాది రెన్యువల్ చేసుకోవాలని పేర్కొన్నారు. లైసెన్సుల విషయమై సంబంధిత డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్‌కు అప్లికేషన్ చేసుకున్న తర్వాత పర్మిషన్ మేరకు సినిమాలు నడుపుకోవాలని అన్నారు.

సినిమా టికెట్ల ధరల విషయమై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఇటీవల డిస్ట్రిబ్యూటర్స్‌తో సమావేశమయ్యారు. కమిటీ నిర్ణయం మేరకు ధరలు ఉంటయాని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించేందుకు జగన్ సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. సీజ్ చేసిన థియేటర్స్ రీ ఓపెన్‌కు పర్మిషన్ ఇవ్వాలని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి మంత్రి పేర్ని నానిని కోరారు. కాగా, సీజ్ అయిన థియేటర్స్ ఓనర్స్ అందరూ మళ్లీ అప్లికేషన్ చేసుకోవాలని, అధికారులు గుర్తించిన లోపాలు సరి చేసుకోవాలని, మంత్రి సూచించారు. ఇకపోతే సినిమాలు నడుపుకోవాలనుకునే వారు ప్రస్తుతానికి అయితే జరిమానా కట్టాలని చెప్పారు.

Also Read:  సీఎం జగన్ మనిషేనా…? మరి ఎందుకు ఇలా!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular