Anushka : టాలీవుడ్ ఆడియన్స్ లో ఒక హీరోయిన్ కి స్టార్ హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కేవలం అనుష్క శెట్టి(Anushka Shetty) కి మాత్రమే సాధ్యం అవుతుంది. ఆరోజుల్లో విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఎలా అయితే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిందో, నేటి తరం ఆడియన్స్ కి అనుష్క శెట్టి అలా నిల్చింది. ఒకపక్క స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మధ్యలోనే ‘అరుంధతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ని తీసి సెన్సేషన్ సృష్టించింది. ఆరోజుల్లో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ పోకిరి ని అనేక ప్రాంతాల్లో దాటింది. అదే విధంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు ఆరోజుల్లో లేవు. అలాంటి సెన్సేషన్ సృష్టించి సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరిగా నిల్చింది.
Also Read : ఏంటి అనుష్క సీరియల్ లో నటించిందా? అందులో రష్మీ కూడా… ఇదెప్పుడు జరిగింది?
అలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన అనుష్క ఎందుకో బాహుబలి సిరీస్ తర్వాత జోరు బాగా తగ్గించింది. సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నప్పటికీ కూడా ఆమె అంగీకరించలేదు. బరువు బాగా పెరిగిపోవడంతో ఇక అనుష్క సినిమాల్లో నటించడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ఆమె వెంటనే ‘భాగమతి’ చిత్రం చేసింది. కమర్షియల్ గా ఈ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ తర్వాత ఈమె నిశబ్దం అనే చిత్రం చేసింది. ఇది నేరుగా ఓటీటీ లో విడుదలైంది. ఈ రెండు సినిమాల తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అనుష్క, ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం ద్వారా మన ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత అనుష్క మళ్ళీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.
ఇప్పటికే ఆమె జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తో ‘ఘాటి’ అనే చిత్రం చేసింది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని గత ఏడాది విడుదల చేయగా, ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అనుష్క ని అంత క్రూరంగా చూసేలోపు అసలు ఈ సినిమా తీసింది క్రిష్ యేనా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అధికారిక ప్రకటన అయితే చేశారు కానీ, ఆ తర్వాత ఈ సినిమా ఏమైందో ఎవరికీ తెలియదు. ఈ చిత్రంతో పాటు ఆమె మరో ఆరు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాల షూటింగ్స్ అన్ని ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. అందులో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో సినిమాకు ఇప్పుడు అనుష్క దాదాపుగా 20 నుండి 25 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది అట.
Also Read : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్ అనుష్క శెట్టి.. ఇదేమి మేక్ ఓవర్ సామీ!