అక్టోబర్ 2న ‘నిశ్శబ్దం’గా అనుష్క రాబోతోంది !

అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ‘నిశ్శబ్దం’ సినిమా మొత్తానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వారు తాజాగా రిలీజ్ డేట్ ను అధికారికంగా రివీల్ చేశారు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. నాని ‘వి’తో మొదలైన డిజిటల్ లో సినిమాల విడుదల పరంపర “నిశ్శబ్దం”తో కొనసాగుతుంది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాని సుమారు […]

Written By: admin, Updated On : September 18, 2020 2:16 pm
Follow us on


అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ‘నిశ్శబ్దం’ సినిమా మొత్తానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వారు తాజాగా రిలీజ్ డేట్ ను అధికారికంగా రివీల్ చేశారు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. నాని ‘వి’తో మొదలైన డిజిటల్ లో సినిమాల విడుదల పరంపర “నిశ్శబ్దం”తో కొనసాగుతుంది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాని సుమారు 45 కోట్లు రూపాయిల భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. నిజానికి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, కానీ రచయిత కోన వెంకట్ కు, ఓ ఛానల్ కు మధ్య సాగిన ఆర్ధిక లావాదేవీల గందరగోళంలో కొన్ని తేడాలు వచ్చి.. ‘నిశ్శబ్దం’ విడుదల నిశ్శబ్దంగా వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు ఈ రోజున రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

Also Read: ప్రభాస్.. ఎనిమిది అడుగులు, మూడు పాత్రలు !

కాగా ఈ సినిమా ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ అని.. సినిమాలో మర్డర్ చేసింది ఎవరనే కోణంలో ప్లే సాగుతూ మంచి ఎమోషనల్ కంటెంట్ తో కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుందని.. అలాగే ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించడం, పైగా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కావడం, అలాగే సస్పెన్స్ సీన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయనే ఆసక్తి కలగడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో మంచి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు అనుష్క, మాధవన్ ల మధ్య నడిచే సస్పెన్స్ ట్రాక్ కూడా చాలా బాగా వచ్చిందట.

Also Read: సినీ సెలబ్రెటీలకు వారి నుంచే డ్రగ్స్?

అన్నిటికి మించి అనుష్క పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని.. ఆ నెగెటివ్ యాంగిల్ నుండి పాజిటివ్ యాంగిల్ లోకి ఆమె క్యారెక్టర్ ఎలా మారింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంటుందని… ఇలా అనుష్క క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయని అందుకే అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాని భారీ మొత్తానికి కొనుగోలు చేేశారని తెలుస్తోంది. అలాగే సినిమాలో మొత్తం క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ అండ్ హారర్ ఎఫెక్ట్స్ ను చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్స్ అయ్యాయని.. మా సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని మేకర్స్ కూడా నమ్మకంగా చెబుతున్నారు.