Anushka Shetty: అందమైన రూపం.. చక్కటి చిరునవ్వుకు తోడు.. హాట్ హాట్ గా కనిపించే అనుష్క శెట్టి అంటే ఇష్టమండని వారండరు. బాహబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవల్లో గర్తింపు తెచ్చకుందీ ముద్దుగుమ్మ. ఆ తరువాత ‘నిశ్మబ్దం’తో కనిపించినా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మళ్లీ ఈ భామకు అవకాశాలు రాలేదు. దీంతో చాలా ఏళ్లు సినిమాల్లో కనిపించకపోయేసరికి ఇక ఇండస్ట్రీని వదిలివెళ్లిందా..? అని అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ అనుష్క శెట్టి ‘వంటలక్క’ పాత్రలో కనిపించింది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఓ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో అనుష్క చెఫ్ గా కనిపించి ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘సూపర్’ డూపర్ హిట్టయింది. దీంతో షాషా పాత్రలో నటించిన అనుష్కకు మొదటి సినిమాతోనే గుర్తింపు వచ్చింది. మొదటి సినిమా గ్లామర్ పాత్రలో పోషించిన ఈమె ఆ తరువాత ‘అరుంధతి’ సినిమాలో వైవిధ్యమైన జేజమ్మ పాత్రను చేయడానికి ఒప్పుకుంది. అయితే ఈ సినిమాతోనే అనుష్క స్టార్ అయింది. ఆ తరువాత అనుష్కకు అవకాశాలు తగ్గుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామకు తీరిక లేకుండా అవకాశాలు వెంటపడ్డాయి. ఏ ఒక్కటి మిస్ చేయకుండా అన్ని సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సినిమా హీరో ఎవరైనా అనుష్క శెట్టితో సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘జీరో సైజ్’ మూవీని ప్రత్యేకంగా చెప్పవచ్చు. పాత్ర ఏదైనా వద్దనకుండా అందులో జీవించే నటి అనుష్క మాత్రమే. నేటి కాలంలో విభిన్న పాత్రలు చేసిన గుర్తింపు అనుష్కకే దక్కింది. ఈ క్రమంలోనే ఆమె ప్రభాస్ తో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఇండస్ట్రీలోనే ప్రభాస్ అంటే మంచి ఫిజిక్ ఉన్న హీరో. ఆయనకు తగ్గట్లుగా అనుష్క తనదైన నటనతో ఆకట్టుకుని మంచి వినోదాన్ని అందించింది.

అయితే ప్రభాస్ తో చేసిన ‘బాహుబలి’ సినిమాతో అనుష్క రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఆ తరువాత మాత్రం అమ్మడుకు అవకాశాలు దక్కలేదు. హీరోయిన్ ఓరియెంట్ డ్ పాత్రలు ఎక్కువగా చేసిన ఈమెకు హీరోయిన్ గా మళ్లీ అవకాశాలు రాలేదు. తాజాగా ఈ భామ ఛెఫ్ పాత్రలో కనిపించి అందరినీ షాక్ కు గురి చేసింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క శెట్టి ‘వంటలక్క’ గా కనిపించనుంది. ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఆ సినిమా కోసం అనుష్క ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.