Anushka Shetty marriage: 44 ఏళ్ళ వయస్సు వచ్చినప్పటికీ , ఇంకా పెళ్లి చేసుకొని హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) మాత్రమే. అనుష్క కి తోడుగా ఒక్క తమన్నా మాత్రమే ఉంది, మిగిలిన హీరోయిన్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి, పిల్లలు కూడా పుట్టేసారు. సమంత అయితే ఈ గ్యాప్ లో రెండవ పెళ్లి కూడా చేసేసుకుంది. తమన్నా ఇంకా 30’s లోనే ఉంది, ఈ సంవత్సరం కాకపోతే, వచ్చే సంవత్సరం అయినా ఆమె పెళ్లి చేసుకోవచ్చు, అడిగేవాళ్ళు ఉండరు. కానీ అనుష్క పరిస్థితి అలా కాదు , 44 ఏళ్ళ వయస్సు వచ్చేసింది. ఇంత వయస్సు వచ్చినా కూడా ఆమె పెళ్లి చేసుకోకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం . కొన్నాళ్ల వరకు ఈమె ప్రభాస్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు ప్రచారం అయ్యాయి.
కానీ అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్లి అంశం గురించి సోషల్ మీడియా లో చర్చ మొదలైంది. కారణం ఈ ఏడాది ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుండడమే. చాలా కాలం నుండి ఆమె బెంగళూరు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమాయణం నడుపుతుంది . పెళ్లి కొడుకు కుటుంబం అనుష్క కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వీళ్ళ పెళ్లి నాలుగేళ్ల క్రితమే జరగాల్సింది. కానీ అనుష్క తన చేతుల్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటిని పూర్తి చేసిన తర్వాత చేసుకుందామని అనుకుందట. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ మొత్తం పూర్తి అవ్వడంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు ఆమె సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ఇదే కనుక నిజమైతే అనుష్క ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు. మరి పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read: మరోసారి నోరు జారీ క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్.. వీడియో వైరల్!
‘భాగమతి ‘ చిత్రం తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న అనుష్క ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి ‘ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఘాటీ ‘ అనే చిత్రం గత ఏడాది విడుదలై భారీ డిజాస్టర్ గా నిల్చింది. ఇక ఇప్పుడు ఆమె చేతిలో కేవలం ‘కథనార్’ అనే మలయాళం చిత్రం మాత్రమే ఉంది. ఇందులో ఆమె విలన్ క్యారెక్టర్ లో నటిస్తోంది. కెరీర్ లో ఇదే ఆమెకు మొట్టమొదటి విలన్ రోల్. భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయి విలన్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ ‘ఘాటీ ‘ మూవీ ప్రొమోషన్స్ సమయం లో చెప్పుకొచ్చింది అనుష్క.
