Anushka Shetty: సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అనుష్క(Anushka Shetty) తో కలిసి నటించాలని ప్రతీ హీరోకి ఉంటుంది. ఆమె కూడా సౌత్ లో దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించేసింది. ఒక్క పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , రామ్ చరణ్ తో తప్ప. అయితే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా అనుష్క ఒప్పుకొని చెయ్యాలంటే ఆమె క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. అలా ఉంటేనే ఒప్పుకుంటుంది, లేకపోతే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తుంది. అందుకే ఈమధ్య కాలం లో ఆమె సినిమాలు చేయడమే పూర్తిగా తగ్గించేసింది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయడం లేదు, కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే చేస్తుంది. ఆమె గత చిత్రం ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ లో కూడా హీరో తో సరిసమానమైన క్యారక్టర్ చేసింది. ఇప్పుడు ఘాటీ(Ghaati Movie) చిత్రం తో మన ముందుకు రాబోతుంది.
Also Read: బుద్ధి లేదా నీకు అంటూ రిపోర్టర్ పై నాగార్జున ఫైర్.. వీడియో వైరల్!
అయితే కథ మరియు తన క్యారక్టర్ నచ్చితేనే ఒక సినిమా చేయడానికి ఇష్టపడే అనుష్క, ఒక హీరో సినిమాలో మాత్రం ఎలాంటి క్యారక్టర్ ఇచ్చినా చేస్తాను, కేవలం ఆయన పక్కన కనిపిస్తే చాలు అని అంటుంది. ఆ హీరో మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీసెంట్ గా ‘ఘాటీ’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఒక FM రేడియో ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అనుష్క శెట్టి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రేడియో జాకీ ఒక ప్రశ్న అడుగుతూ ‘నేను ఇండస్ట్రీ అమితంగా ఇష్టపడేది ఇద్దరినీ. ఒకరు అనుష్క అయితే మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. భవిష్యత్తులో అవకాశం వస్తే చేస్తారా?’ అని అడుగుతాడు.
దానికి అనుష్క సమాధానం చెప్తూ ‘నేను ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను. కానీ అవకాశం రాలేదు. అవకాశం వస్తే ఎలాంటి క్యారక్టర్ వచ్చినా ఆయనతో కలిసి నటిస్తాను. పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన చేసే పనులను నిత్యం అభిమానించే మనిషిగా ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది అనుష్క. ఆమె మాట్లాడిన ఈ మాటలు బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గురించి ఇంత మంచిగా మాట్లాడినందుకు అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇకపోతే అనుష్క నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఘాటీ’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా కాలం తర్వాత అనుష్క నుండి రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. టీజర్, ట్రైలర్ వంటివి ఇప్పటికే ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్నాయి. క్రిష్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమేరకు అలరించబోతుందో చూడాలి.
I’m always happy to work with @PawanKalyan Garu if I get the opportunity. And Very Very Happy Birthday Andi Always Lots Of Love Always & Huge Admire Of Everything He Does ❤️✨”
– @MsAnushkaShetty garu , via 93.5 RED FM Radio Interview – yesterday ️
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) September 3, 2025