స్టార్ బ్యూటీ అనుష్క తన పెళ్లి కబుర్లతో అభిమానుల ముందుకు వస్తోంది అనుకుంటే.. ఒక పాజిటివ్ సందేశంతో అభిమానులను పలకరించింది. ఆ సందేశం విషయానికి వస్తే.. ‘మీరు ప్రేమించే వారితో, అలాగే మిమ్మల్ని ప్రేమించే వారితో టచ్ లో ఉండండి. ప్రేమను చూపించండి’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో అనుష్క ఇంగ్లిష్ లో ఒక భారీ మెసేజ్ ను పోస్ట్ చేసింది. ఆమె రాసుకొచ్చిన ఆ సుదీర్ఘమైన మెసేజ్ ను క్లుప్తంగా ముచ్చటించుకుంటూ పోతే..
‘ప్రతి సమస్యని అధిగమిస్తూనే ముందుకు వెళ్లాలి. కష్టాలు చెప్పే పాఠాలు నేర్చుకోవాలి. స్నేహితులతో సరదాగా గడుపుదాం, వారిని గట్టిగా ఆలింగనం చేసుకుందాం. మనసారా నవ్వుకుంటూ ఆశతో జీవిద్దాం. కానీ, జీవితంలో కిందపడి నిలబడే క్రమంలో ఉద్రేకానికి లోను కావద్దు. దైర్యంగా ఉండండి. అందరితో బంధాలను పెంచుకొండి.
మీతో పెనవేసుకున్న ప్రేమలను, ఆ ప్రేమ తాలూకు మధుర క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. ఈ సంక్షోభ సమయంలోనూ బతికే అవకాశం మనకు దక్కిందన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. మన చుట్టూ ఉన్న అందమైనవి అన్ని మనకు దూరం అవుతున్నాయి. ఆ కోల్పోతున్న వాటిలో మన హృదయం ఉండకూడదు. హాయిగా జీవిస్తూ ప్రేమించండి’ అంటూ అనుష్క వెరీ ఎమోషనల్ మెసేజ్ ఇచ్చింది.
అనుష్క గతంలో ఇలాంటి మెసేజ్ ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఉన్నట్టు ఉండి ఇలాంటి మెసేజ్ పోస్ట్ చేయడానికి కారణం.. ఆమె పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనలే కారణం అయి ఉంటాయని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. అనుష్క, ప్రభాస్ ప్రేమలో ఉన్నారని, కానీ వీరి ప్రేమను ప్రభాస్ అమ్మగారు అంగీకరించలేదని, అందుకే అనుష్క ప్రభాస్ కి దూరం అయిందని.. ఆ బాధలో బహుశా ఈ మెసేజ్ పెట్టింది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు.