Virat Kohli: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు తమ ప్రియతమ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. క్రికెట్ లో ఎన్నో మైలురాళ్లు దాటిన ఆటగాడిగా రికార్డులు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లికి క్రికెట్ అభిమానులతో పాటు పలువురు వీఐపీలు సైతం తమ విషెష్ తెలియజేస్తున్నారు. విరాట్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

భారత క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ సృష్టించిన రికార్డులను సైతం తిరగరాసిన ఘనత విరాట్ సొంతం. ఎన్నో మ్యాచుల్లో తనదైన శైలిలో ఆడుతూ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో అద్భుతాలు చేసిన విరాట్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. తమ సందేశాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విరాట్ కు సామాజిక మాధ్యమాల్లో కూడా విపరీతమైన సందేశాలు వస్తున్నాయి. సినీ, క్రీడ, రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో కోహ్లి నేడు పుట్టిన రోజు సందడిలో మునిగి తేలుతున్నారు. ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని అభిలషిస్తున్నారు.
ఇక ఆయన భార్య అనుష్క ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. తన జీవితంలో ఎన్నో అనుభూతులకు కారణమైన విరాట్ కు ఏమివ్వనని చెప్పింది. నువ్వెంత గొప్ప క్రీడాకారుడివో ప్రపంచానికి వినిపించేంత బిగ్గరగా అరవాలని ఉందని పేర్కొంది. చీకటిని చీల్చుకుంటూ వెలుగుల వెంట పరుగెత్తే ఆటగాడిగా నీకు నీవే సాటి అంటూ ప్రశంసించింది.