China: కరోనాకు పుట్టిల్లయిన చైనాలో పరిస్థితి రోజురోజుకు మారుతోంది. వైరస్ తీవ్రత మరింత పెరుగుతోంది. మరోవైపు విద్యుత్ సంక్షోభం కూడా వెంటాడుతోంది. ఆస్రేలియాతో ఏర్పడిన విభేదాల కారణంగా బొగ్గు దిగుమతి నిలిపివేయడంతో ఇంధన కొరత నెలకొంది. దీంతో కాలుష్యం బారిన పడకుండా నిరోధించే చర్యల్లో భాగంగా డ్రాగన్ పలు కోణాల్లో చర్యలు తీసుకుంటోంది. దేశ రాజధాని బీజింగ్ తోపాటు నగరాల్లో కాలుష్య పొగలు కమ్ముకోకుండా ప్రధాన రహదారులను మూసివేస్తోంది.

మరోవైపు చైనాలో వాయుకాలుష్యం పెరిగిపోతోంది. చైనాలోని వాయు ఊద్గారాల్లో పౌరుల ఆరోగ్యంపై దెబ్బతీసే విధంగా శ్వాసకోశ వ్యాధులు సంభవించేలా ఉన్నాయని పరిశీలనలో వెల్లడవుతోంది. దీంతో కొద్ది రోజుల్లో చైనాలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ వేదిక కావడంతో పరిస్థితిని అదుపు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
బొగ్గు ఆధారిత పరిశ్రమల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి కొనసాగించే డ్రాగన్ ఇప్పుడు బొగ్గు నిల్వలు అందుబాటులో లేకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటోంది. ఇంధన కొరతతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతోంది. ఫలితంగా విద్యుత్ సమస్య కూడా డ్రాగన్ ను వేధిస్తోంది. ఫలితంగా డీజిల్ వాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి.
చైనాలో చోటుచేసుకున్న పరిస్థితులపై అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆహార సంక్షోభం కూడా రానుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆహార పదార్థాల వినియోగంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. నిలువ ఉంచుకునే పదార్థాలను కూడా బాగా వాడుకోవాలని చెబుతోంది. ఈ క్రమంలో చైనాలో పరిస్థితులు మారుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: COP26: భూమి వినాశనంపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక