సినిమాలను వదలనంటున్న ‘బొమ్మాళీ’..!

టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ కెరీర్ ప్రారంభించిన అనుష్క ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి సౌత్ హీరోయిన్ గా .. అగ్ర కథానాయికగా ఎదిగింది. అనుష్కశెట్టి(స్వీటీ) తన అందం.. అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. Also Read: బతికి ఉండగానే హీరోయిన్ ను చంపేశారు ! అనుష్క తాజాగా నటించిన చిత్రం ‘నిశబ్ధం’. ఈ మూవీ తర్వాత అనుష్క పెళ్లి చేసుకుంటుందని.. సినిమాలకు గుడ్ బై […]

Written By: NARESH, Updated On : October 5, 2020 4:59 pm
Follow us on

టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ కెరీర్ ప్రారంభించిన అనుష్క ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి సౌత్ హీరోయిన్ గా .. అగ్ర కథానాయికగా ఎదిగింది. అనుష్కశెట్టి(స్వీటీ) తన అందం.. అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.

Also Read: బతికి ఉండగానే హీరోయిన్ ను చంపేశారు !

అనుష్క తాజాగా నటించిన చిత్రం ‘నిశబ్ధం’. ఈ మూవీ తర్వాత అనుష్క పెళ్లి చేసుకుంటుందని.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందనే వార్తలు విన్పించాయి. గతంలోనూ అనుష్క పెళ్లిపై అనేకసార్లు వార్తలురాగా అవన్నీ పుకార్లు నిలిచిపోయాయి. అయితే ‘నిశబ్ధం’లో అనుష్క లుక్స్ పై.. బరువుపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ మూవీలో అనుష్క కంటే అంజలి హైలెట్ గా నిలిచింది.

ఈనేపథ్యంలో అనుష్క ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అనుష్క ఇన్ డైరెక్టుగా స్పందించారు. ఎన్నడూ సోషల్ మీడియాలో చాట్ చేయని అనుష్క తాజాగా ఓ అభిమానితో చాట్ చేసింది.

ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు భాగమతి.. నిశ్శబ్ధం సినిమాలు చాలా గ్యాప్ తీసుకొని చేశారు. ఇక తర్వాతి సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించాడు.

Also Read: ‘డార్లింగ్’ వెంటపడుతున్న ‘మన్మథుడు’..!

దీనిపై అనుష్క స్పందిస్తూ త్వరలోనే చెబుతానని సమాధానం ఇచ్చింది. దీంతో అనుష్క కథలు వింటూ సినిమాల ఒప్పుకోవడానికి రెడీగానే ఉందనే సంకేతాన్ని అభిమానులకు పంపించినట్లు అయింది. అనుష్క పెళ్లి సంగతేమోగానీ.. ఇప్పట్లో మాత్రం స్వీటీ సినిమాలను వదలేది లేదని ఇన్ డైరెక్ట్ గా చెబుతోంది. నిర్మాతలు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే అనుష్క కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడం ఖాయంగా కన్పిస్తోంది.