https://oktelugu.com/

Virat Kohli- Anushka Sharma: తన కుమార్తె ఫోటో పై అనుష్క స్పందన !

Virat Kohli- Anushka Sharma: సినీ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత జీవితం తెరిచిన పుస్తకం అవుతుంది. మీడియా, ప్రజల కళ్లన్నీ సెలెబ్రెటీస్ మీదనే ఉంటాయి. కాగా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ – బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల కూతురు వామిక ఫొటోలు వైరల్ కావడంపై తాజాగా అనుష్క స్పందించింది. ‘మా కుమార్తె ఫొటోలు క్యాప్చర్ కావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలిసింది. ఆ సమయంలో కెమెరా మాపై ఉందని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 24, 2022 / 01:55 PM IST
    Follow us on

    Virat Kohli- Anushka Sharma: సినీ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత జీవితం తెరిచిన పుస్తకం అవుతుంది. మీడియా, ప్రజల కళ్లన్నీ సెలెబ్రెటీస్ మీదనే ఉంటాయి. కాగా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ – బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల కూతురు వామిక ఫొటోలు వైరల్ కావడంపై తాజాగా అనుష్క స్పందించింది. ‘మా కుమార్తె ఫొటోలు క్యాప్చర్ కావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలిసింది. ఆ సమయంలో కెమెరా మాపై ఉందని నాకు తెలియదు.

    Anushka Sharma-Virat Kohli

    వామిక గోప్యత విషయంలో మొదట్లో చెప్పినట్లే మా వైఖరి ఉంటుంది. మా నిర్ణయాన్ని గౌరవించి ఫొటోలు డిలీట్ చేసిన వారందరికీ థాంక్స్’ అని చెప్పింది. అనుష్క అభ్యర్థనతో కొన్ని వెబ్‌సైట్లు ఫొటోలు డిలీట్ చేశాయి. మొత్తానికి కూతురి ఫొటో రివీల్‌ పై అనుష్క ఈ విధంగా స్పందించింది. ఇక కోహ్లీ – అనుష్క శర్మ కొన్నాళ్లపాటు ప్రేమించుకుని 2017 లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

    Also Read: కరోనా విలయం.. దేశంలో థర్డ్ వేవ్ తప్పదా? ఏపీ, తెలంగాణను వణికిస్తున్న మహమ్మారి

     

    Virat Kohli and Anushka Sharma

    అప్పటి నుంచి అన్యోన్యంగా కలిసి ఉంటూ 2021, జనవరి 11 న ఈ దంపతులిద్దరూ ఆడపిల్లకి జన్మనివ్వటంతో తల్లి దండ్రులుగా ప్రమోట్ అయ్యారు. వారి పాపని చూడటానికి దేశమంతా కళ్లప్పగించుకుని ఎదురు చూస్తున్నా తమ పాపను చూపించడానికి ఈ క్రేజీ జంట మాత్రం ఆసక్తి చూపించలేదు. పైగా మా పాప ఫోటోలను వైరల్ చేయకండి అంటూ అభిమానులకు అనుష్క శర్మ ఓ విన్నపం కూడా పెట్టింది. మొత్తమ్మీద కోహ్లీ – అనుష్క శర్మ ‘వామిక’ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటున్నారు.

    Also Read: ప్రముఖ డాక్టర్ తో తమన్నా పెళ్లి… క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

    Tags