https://oktelugu.com/

పోలవరం ముంపు: ఆ ఏడు మండలాలు మళ్లీ తెలంగాణకేనా..?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో పలు మండలాలు ఏపీలోకి వెళ్లాయి. అవే పోలవరం ముంపు మండలాలు. అయితే.. ఇప్పుడు ఆ మండలాలపై మరోసారి చర్చ మొదలైంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించాలని చూస్తోంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన ఎత్తు మేరకు నీరు నిల్వ చేస్తే రూ.30 వేల కోట్లు పునరావాసానికి కావాలి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అంత పెద్ద మొత్తంలో నిధులులేవు. కాబట్టి 41 మీటర్లకు తగ్గించాలని ఏపీ సర్కార్ ఆలోచన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 11:14 AM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో పలు మండలాలు ఏపీలోకి వెళ్లాయి. అవే పోలవరం ముంపు మండలాలు. అయితే.. ఇప్పుడు ఆ మండలాలపై మరోసారి చర్చ మొదలైంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించాలని చూస్తోంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన ఎత్తు మేరకు నీరు నిల్వ చేస్తే రూ.30 వేల కోట్లు పునరావాసానికి కావాలి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అంత పెద్ద మొత్తంలో నిధులులేవు. కాబట్టి 41 మీటర్లకు తగ్గించాలని ఏపీ సర్కార్ ఆలోచన చేస్తోంది.

    Also Read: తెలంగాణ సెంటిమెంట్ ఇక పనిచేయదా?

    ఒకవేళ ఏపీ సర్కార్‌‌ తీసుకున్న నిర్ణయం అమల్లోకి తెస్తే అప్పుడు ఏపీలో కలిపిన ఏడు ముంపు మండలాల్లో ముంపు ఉండదు. అక్కడ పరిహారం చెల్లించాల్సిన అవసరమూ రాదు. ఇప్పుడు ముంపు లేకపోతే ఆ ఏడు మండలాలను ఏపీలో ఉంచాల్సిన అవసరం ఉండదు. మరోవైపు ఆ ఏడు మండలాలను ఏపీలో అక్రమంగా కలిపేసుకున్నారని చాలా రోజులుగా టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.

    పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూ తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను 2014లో ఏపీలో కలిపింది కేంద్రం. ఈ విలీనాన్ని తెలంగాణ ఉద్యమ సంఘాలు, టీఆర్ఎస్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లోనే రాముడి ఆలయం ఉన్న భద్రాచలం గ్రామాన్ని ఏపీలో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ భావోద్వేగాల ప్రాతిపదికన విలీనం నుంచి మినహాయించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భద్రాచలం కూడా ఏపీదేనని.. తమకు ఇచ్చేయాలని వాదిస్తూ వచ్చింది.

    Also Read: బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ తిరుపతి.. జనసేన ఏం చేస్తుంది?

    అయితే.. ఇప్పుడు ముంపు లేకుండా ఆ ఏడు మండలాలను తమకు ఇచ్చేయాలని తెలంగాణ కోరే అవకాశమే ఉంది. కేంద్ర స్థాయిలో పోరాడకుండా ఉండదు. అవసరం లేనప్పుడు తెలంగాణకు ఇస్తే ఏమవుతుందని ఏపీ సర్కార్ అనుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఏపీ సర్కార్ వ్యవహారశైలి కూడా అలానే ఉంది. త్వరలో దీనికి సంబంధించి అడుగులు ముందుకుపడినా ఆశ్చర్యం లేదనే వాదన రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్